Home > క్రీడలు > భారత్ - పాక్ మ్యాచ్కు వాన గండం..

భారత్ - పాక్ మ్యాచ్కు వాన గండం..

భారత్ - పాక్ మ్యాచ్కు వాన గండం..
X

ఆసియా కప్లో మరో భారీ మ్యాచ్కు రంగం సిద్ధం అయింది. ఆదివారం భారత్, పాక్ మధ్య కొలంబో వేదికగా ఈ బిగ్ ఫైట్ జరగనుంది. మొదటి మ్యాచ్కు కళ్లు కాయలు కాసేలా ఎదుచూసిన ఫ్యాన్స్కు వర్షం నిరాశ పరిచింది. సూపర్‌-4లో ఈ రెండు జట్లు మరోసారి తలపడుతుండటంతో ఫ్యాన్స్‌ హ్యాపీ ఫీల్ అయ్యారు. అయితే ప్రస్తుతం వారికిది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు.

భారత్ - పాక్ సూపర్ 4 మ్యాచ్కూ వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఆదివారం మ్యాచ్కు 90 శాతం వర్షం కురిసే అవకాశముందని సమాచారం. ముఖ్యంగా సాయంత్రం వేళలో వర్షం కురిసే ఛాన్స్‌ ఎక్కువగా ఉందని వార్తలొస్తున్నాయి. రిజర్వ్‌ డే అయిన తర్వాతి రోజు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. వర్షం పడొద్దని దేవుళ్లకు మొక్కుతున్నారు.

మరోవైపు పాక్ను చిత్తు చేయాలని చూస్తున్న టీమిండియా.. తుది జట్టు ఎంపికపై ఫోకస్ పెట్టింది. నేపాల్తో మ్యాచ్కు దూరమైన బుమ్రా.. తిరిగి జట్టుతో చేరాడు. దాంతో బౌలింగ్ యూనిట్ బలంగా తయారయింది. కేఎల్ రాహుల్ కూడా నెట్స్లో రాణిస్తున్నాడు. బుమ్రా రాకతో పేస్ బౌలర్స్ షమీ, సిరాజ్, శార్దూల్లలో ఒకరు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత కొద్ది మ్యాచుల్లో చూసుకుంటే బ్యాటింగ్, బౌలింగ్లో శార్దూల్ ఆశించినంత రాణించడం లేదు. దీంతో అతనిపై వేటు తప్పకపోవచ్చు.


Updated : 9 Sep 2023 4:04 PM GMT
Tags:    
Next Story
Share it
Top