క్రికెట్ లీగ్‌లోకి ఎంట్రీ.. హైదరాబాద్ టీంను కొనుగోలు చేసిన రామ్చరణ్
X
రామ్ చరణ్ కు క్రికెట్ అంటే అమితమైన ఇష్టం అన్న విషయం తెలిసిందే. అవకాశం ఉన్నప్పుడల్లా సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్)లో తెలుగు వారియర్స్ తరుపున ఆడుతుంటాడు. చాన్స్ ఇస్తే.. విరాట్ కోహ్లీ బయోపిక్ లో యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లు చాలా ఇంటర్వూస్ లో చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు క్రీడా రంగంలోకి అడుగుపెట్టాడు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌లో హైదరాబాద్ జట్టును తాజాగా రామ్ చరణ్ కొనుగోలు చేశాడు. ఆదివారం ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రవేశపెట్టాడు. ‘ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌లో హైదరాబాద్ జట్టు ఓనర్ గా వ్యవహరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సమాజంలో స్ఫూర్తిని పెంపొందించడం, ప్రతిభను వెలికి తీయడం, గల్లీ క్రికెట్ సంస్కృతిని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఈ రంగంలోకి అడుగుపెట్టా’ అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.
ఈ సందర్భంగా ఓ లింక్ ను షేర్ చేసిన రామ్ చరణ్.. జట్టులో భాగం కావాలనుకునే వారు లింక్ ద్వారి రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. ఫ్యూచర్ ట్యాలెంట్ లను వెలికి తీసేందుకు ఈ టోర్నీ సాయపడుతుందని జతిన్ పరాంజపే చెప్పుకొచ్చాడు. 2024 మార్చి 2 నుంచి 9వ తేదీ వరకు ఈ టోర్నీ జరగనుంది. కాగా ముంబై టీంను అమితాబ్ బచ్చన్, బెంగళూను హృతిక్ రోషన్, జమ్ము కశ్మీర్ ను అక్షయ్ కుమార్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
Excited to announce my ownership of Team Hyderabad in the Indian Street Premier League!
— Ram Charan (@AlwaysRamCharan) December 24, 2023
Beyond cricket, this venture is about nurturing talent, fostering community spirit, and celebrating street cricket's essence.
Join me as we elevate Hyderabad's presence in the ISPL,… pic.twitter.com/DQA29n18qp
RAM CHARAN is the owner of Hyderabad which represents both Telangana, and Andhrapradesh in INDIAN STREET PREMIUM LEAGUE pic.twitter.com/27ITTHLVPu
— ORANGE ARMY (@SUNRISERSU) December 24, 2023