Home > క్రీడలు > BabarAzam: 39/6.. ఓటమి కొరల్లోంచి కాపాడిన బాబర్ ఆజం

BabarAzam: 39/6.. ఓటమి కొరల్లోంచి కాపాడిన బాబర్ ఆజం

BabarAzam: 39/6.. ఓటమి కొరల్లోంచి కాపాడిన బాబర్ ఆజం
X

పొట్టి క్రికెట్ లో 120 ఈజీ టార్గెట్ అయినా.. ప్రత్యర్థి బౌలింగ్ కు బోల్తాపడి 39/6 పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ పట్టువదలని బాబర్ ఆజం.. అద్భుత హాఫ్ సెంచరీ చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024లో బాబర్ ఆజం (56, 49 బంతుల్లో) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓటమి కోరల్లో చిక్కుకున్న జట్టును.. టెయిలెండర్ అజ్మతుల్లా ఒమర్ జాయ్ (47, 35 బంతుల్లో) సాయంతో గెలిపించాడు. సిల్హెట్ స్ట్రైకర్స్ తో జరిగిన మ్యాచ్ లో.. రంగపూర్ రైడర్స్ కు ప్రాతినిథ్యం వహించిన బాబర్, ఒమర్ జాయ్ జోడీ అజేయంగా ఏడో వికెట్ కు 86 పరుగులు జోడించి 4 వికెట్ల తేడాతో గెలిపించారు.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రంగ్ పూర్ రైడర్స్.. సిల్హెట్ స్ట్రైకర్స్ 119 పరుగులకే కుప్పకూల్చారు. సిల్హెట్ స్ట్రైకర్స్ బ్యాటర్లు హోవెల్‌ (43), కట్టింగ్‌ (31), షాంటో (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. రిపన్‌ మొండల్‌ (2/19), మెహిది హసన్‌ (2/18), మొహమ్మద్‌ నబీ (1/17), హసన్‌ మురద్‌ (1/29) బౌలింగ్ లో చెలరేగారు. 120 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రంగపూర్ రైడర్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టులో ముగ్గురు డకౌట్ కాగా.. రోనీ తాలుక్‌దార్‌ 6, నురుల్‌ హసన్‌ 8, షమీమ్‌ హొసేన్‌ 2 పరుగులు చేశారు. తర్వాత బాబర్, ఒమర్ ఒమర్ జాయ్ జోడీ అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు. సిల్హెట్ స్ట్రైకర్స్ బౌలర్లలో హేమంత 3 వికట్లు పడగొట్టగా.. నగరవ, తంజిమ్‌ సకీబ్‌, నజ్ముల్‌ ఇస్లాం తలో వికెట్ పడగొట్టారు.





Updated : 23 Jan 2024 7:31 PM IST
Tags:    
Next Story
Share it
Top