ఆర్ అశ్విన్ రికార్డ్ ల మోత మోగించాడు
X
వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ చెలరేగిపోయింది. కేవలం 150 పరుగులకే వెస్ట్ ఇండీస్ ను కట్టడిచేసింది. బౌలర్ ఆర్ అశ్విన్ అయితే రెచ్చిపోయాడు. తన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఐదు వికెట్లు తీసుకుని రికార్డులు సృష్టించాడు.
వెస్ట్ ఇండీస్ మ్యాచ్ తో భారత స్పిన్నర్ ఆర్ అశ్విన్ బోలెడు రికార్డులను సొంతం చేసుకున్నాడు. 5 వికెట్లు పడగొట్టి బ్యాటర్లను చిత్తు చేయడమే కాక....స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే రికార్డ్ ను కూడా తుడిచేశాడు. టెస్ట్ ల్లో భారత్ నుంచి అత్యధిక వికెట్లు బౌల్డ్ చేసిన ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. అంతకు ముందు ఈ రికార్డ్ అనిల్ కుంబ్లే పేరిట ఏంది. అనిల్ 94సార్లు ప్రత్యర్ధి బ్యాట్స్ మెన్ ను బౌల్డ్ చేయగా....అశ్విన్ 95 సార్లు ఈ ఫీట్ నమోదు చేశాడు. తర్వాతి స్థానాల్లో కపిల్ దేవ్ 88, పేసర్ మహ్మద్ షమి 66 తో ఉన్నారు.
ఇర అంతర్జాతీయ క్రికెట్లో 700 వికెట్లు తీసిన మూడో భారతీయ ఆటగాడిగా కూడా అశ్విన్ నిలిచాడు. అనిల్ కుంబ్లే 953, హర్భజన్ సింగ్ 707 వికెట్లు తీసుకున్నారు.
టెస్ట్ క్రికెట్ లో తండ్రీకొడుకులను అవుట్ చేసిన అయిదో బౌలర్ గా కూడా అశ్విన్ నిలిచాడు. త్యాగ్ నారాయణ్ చంద్రపాల్ ఈ ఘనత సాధించాడు. అంతకు ముందు 2011లో ఢిల్లీలో త్యాగ్ నారాయణ్ శివనారాయణ్ ను చందర్ పాల్ ను కూడా అశ్విన్ అవుట్ చేశాడు. తండ్రీకొడుకులను అవుట్ చేసిన తొలి భారతీయుడు మాత్రం అశ్వినే.
టెస్ట్ క్రికెట్ లో అశ్విన్ ఒక ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీయడం ఇది 33వ సారి. ముత్తయ్య మురళీధర్ 67, షేన్ వార్న్ 37, రిచర్డ్ హాడ్లీ 36, అనిల్ కుంబ్లే 35, రంగనా హెరాత్ 34....అశ్విన్ కంటే ముందున్నారు. ఇంగ్లండ్ స్టార్ జేమ్స్ అండర్సన్ 32 సార్లతో అశ్విన్ తర్వాత స్థానంలో ఉన్నాడు.