Home > క్రీడలు > IND vs AUS: క్రికెట్ లైవ్లో మాస్ ఎంట్రీ ఇచ్చిన రవితేజ.. వీడియో

IND vs AUS: క్రికెట్ లైవ్లో మాస్ ఎంట్రీ ఇచ్చిన రవితేజ.. వీడియో

IND vs AUS: క్రికెట్ లైవ్లో మాస్ ఎంట్రీ ఇచ్చిన రవితేజ.. వీడియో
X

హిందీ, ఇంగ్లిష్ లో క్రికెట్ కామెంట్రీ వింటుంటే.. ఓ ఫీల్ ఉంటుంది. కానీ, సొంత భాషలో వింటుంటే మాత్రం ఆ మజానే వేరు. వరల్డ్ కప్ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ దక్కించుకుంది. ఈ క్రమంలో స్టార్ స్పోర్ట్స్ తెలుగు క్రికెట్ లైవ్ షోలో మాస్ మహారాజా రవితేజం ఎంట్రీ ఇచ్చాడు. దీంతో తెలుగు ఆడియన్స్ లో సందడి మొదలయింది. లైవ్ లో పాల్గొన్న రవితేజ.. కళ్యాణ్ కృష్ణ, ఆశీష్ తో కలిసి కామెంట్రీ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా రవితేజ నటించిన సినిమా టైగర్ నాగేశ్వర రావు అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ తెలుగు క్రికెట్ లైవ్ లో కామెంట్రీ ఇచ్చాడు. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానున్న ఈ సినిమా.. స్టువర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా తెరకెక్కుతుంది.










Updated : 8 Oct 2023 5:22 PM IST
Tags:    
Next Story
Share it
Top