Team India: టీమిండియాలో కీలక మార్పు.. అక్షర్ పటేల్ ఔట్.. అశ్విన్ ఇన్..
X
అక్టోబర్ 5 నుంచి ఇండియాలో క్రికెట్ వరల్డ్ కప్ జరగనుంది. ఇప్పటికే అన్ని దేశాలు టీంలను ప్రకటించాయి. (Team India) బీసీసీఐ సైతం భారత్ స్క్వాడ్ను ప్రకటించగా.. ఇప్పుడు అందులో కీలక మార్పులు చేసింది. గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో సీనియర్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్కు చోటు కల్పించింది. ఇదొక్క మార్పు తప్ప మిగితా టీం యథాతధంగా ఉంటుంది. ఈ మేరకు తుదిజట్టును ప్రకటించింది.
వరల్డ్ కప్లో భాగంగా అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత్ తొలిపోరులో తలపడనుంది. క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ - పాక్ మ్యాచ్ అక్టోబర్ 14న జరగనుంది. ఈ టోర్నికి ముందు భారత్ రెండు వార్మప్ మ్యాచులను ఆడనుంది. సెప్టెంబర్ 30న ఇంగ్లాండ్, అక్టోబర్ 3న నెదర్లాండ్స్తో టీమిండియా వార్మప్ మ్యాచులు ఆడనుంది.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, బుమ్రా, షమీ, సిరాజ్