Home > క్రీడలు > ముగిసిన ఆట.. సెంచరీతో కాపాడిన జడేజా

ముగిసిన ఆట.. సెంచరీతో కాపాడిన జడేజా

ముగిసిన ఆట.. సెంచరీతో కాపాడిన జడేజా
X

అతని ఇన్నింగ్స్ కు మాటల్లేవ్. ఎందుకంటే.. క్రీజులోకి వచ్చే సమయానికి భారత్ స్కోరు 33/3. మొదటి సెషన్ లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడి నుంచి కోలుకుని ఇన్నింగ్స్ ను నిలబెట్టాలి. స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాలి. ఒక పక్క కెప్టెన్ రోహిత్ శర్మ బాదుతుంటే.. సహకారం అందించాడు. తర్వాత వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ ఇంగ్లాండ్ దుమ్ము దులుపుతుంటే.. తోడుగా నిలబడాలి. అంతా చూస్తున్నాడు. ఓర్పుగా నిలబడ్డాడు. కుదురుకుని మొదటి నుంచి నిలకడగా ఆడుతూ ఇంగ్లాండ్ ను సైలెంట్ గా దెబ్బకొట్టాడు. అద్భుత సెంచరీతో భారత్ భారీ స్కోర్ చేసేందుకు భాగం అయ్యాడు. క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా.. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. చాలా రోజుల తర్వాత అద్భుత (110, 211 బంతుల్లో) సెంచరీ చేశాడు. దీంతో భారత్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జడేజా, కుల్దీప్ యాదవ్ (1) ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3 వికెట్లు పడగొట్టగా.. టామ్ హార్ ట్లే ఒక వికెట్ తీసుకున్నాడు.


Updated : 15 Feb 2024 5:46 PM IST
Tags:    
Next Story
Share it
Top