Ravindra Jadeja : రేపు ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్ మ్యాచ్.. టీమిండియాలోకి ఆ ఇద్దరు
X
భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అభిమానులకు శుభవార్త. ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే మూడో టెస్ట్ మ్యాచ్‌కు రవీంద్ర జడేజా అందుబాటులో ఉండనున్నారు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ తలపడుతోన్న సంగతి తెలిసిందే. రేపటి నుంచి రాజ్ కోట్ వేదికగా ఆ మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ హైదరాబాద్‌లో జరగ్గా అందులో టీమిండియా ఓడింది.
ఇంగ్లండ్ జట్టుతో రెండో టెస్ట్ మ్యాచ్ వైజాగ్‌లో జరింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం రెండు జట్లూ 1-1 పాయింట్లతో ఉన్నాయి. మూడో మ్యాచ్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. అయితే ఆ మ్యాచ్ తుది జట్టులో జడేజా ఉంటాడా ఉండడా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు జడేజా మూడో టెస్ట్‌కు సిద్దంగా ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
మూడో టెస్ట్ మ్యాచ్ కోసం జడేజా నిన్నే రాజ్ కోటలో టీమిండియా ప్రాక్టీస్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే జగరబోయే మూడు టెస్ట్ మ్యాచ్‌లకు 17 మంది సభ్యులను బీసీసీఐ ప్రకటించింది. అందులో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలున్నాయి. అయితే గాయం కారణంగా శ్రేయస్, రాహుల్ ఇద్దరూ మూడో టెస్ట్ మ్యాచ్‌కు దూరం అయ్యారు. బీసీసీఐ వర్గాల ప్రకారం..రాజ్ కోట్ టెస్ట్ మ్యాచ్‌కు కుల్దీప్ యాదవ్, జడేజాలు తుది జట్టులో చోటు దక్కించుకుంటారని తెలుస్తోంది.