క్రికెట్ మ్యాచ్ మధ్యలో ఆర్సీబీ ప్లేయర్కు మ్యారేజ్ ప్రపోజల్
X
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లు జరుగుతుంటే.. కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. అందులో కొన్ని సరదాగా ఉంటే.. మరికొన్ని ఉద్రిక్తలకు దారితీస్తుంటాయి. ఇవన్నీ ఒకెత్తైంతే.. మ్యాచ్ మధ్యలో లవ్, మ్యారేజ్ ప్రపోజల్స్ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇలాంటి వీడియోలు నెట్టింట చాలానే చూస్తుంటాం. తాజాగా డబ్య్లూపీఎల్ మ్యాచ్ లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ లేడీ క్రికెటర్ వీరాభిమాని.. తనకు పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆ లేడీ క్రికెటర్ ఎవరంటే?
గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో బెంగళూరు ప్లేయర్ శ్రేయాంక పాటిల్ కి ఓ అభిమాని మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు. ‘విల్ యూ మ్యారీ మీ శ్రేయాంక పాటిల్’ అని రాసిన ఫ్లకార్డును ప్రదర్శించాడు. దీంతో స్టేడియంలోని కెమెరాలన్నీ అతనివైపు తిరిగాయి. దీంతో అది చూసిన ప్లేయర్స్ నవ్వుకున్నారు. అయితే శ్రేయాంక మాత్రం దీనిపై స్పందించలేదు.
Marriage proposal for Shreyanka Patil and RCB’s players laughing in the dressing room. pic.twitter.com/yoY4e5zfxK
— CricketMAN2 (@ImTanujSingh) February 27, 2024