Home > క్రీడలు > IPL 2024 : స్టార్ ప్లేయర్లకు షాక్.. ఫ్రాంచైజీలు వదిలించుకునే ప్లేయర్స్ లిస్ట్ ఇదే..!

IPL 2024 : స్టార్ ప్లేయర్లకు షాక్.. ఫ్రాంచైజీలు వదిలించుకునే ప్లేయర్స్ లిస్ట్ ఇదే..!

IPL 2024 : స్టార్ ప్లేయర్లకు షాక్.. ఫ్రాంచైజీలు వదిలించుకునే ప్లేయర్స్ లిస్ట్ ఇదే..!
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. IPL 2024 కోసం ఫ్రాంచైజీలు సిద్దమవుతున్నాయి. వన్డే ప్రపంచకప్ ముగిసిన వెంటనే ఐపీఎల్ 2024 ప్లాన్ ఆఫ్ యాక్షన్ను బీసీసీఐ షురూ చేయనుంది. డిసెంబర్ 15-19 మధ్య దుబాయ్ వేదికగా ఐపీఎల్ - 2024 మినీ వేలం నిర్వహించే ఛాన్సుంది. ఈ క్రమంలో ఫ్రాంచైజీలకు మినీ వేలానికి సంబంధించి సమాచారం ఇవ్వడంతో పాటు రిలీజ్, రిటైన్ ప్లేయర్స్ లిస్టును నవంబర్ 15లోపు అందజేయాలని బీసీసీఐ ఆదేశించింది. అయితే తాజాగా ఆ గడువును నవంబర్ 26కు పొడగించింది.

బీసీసీఐ ఆదేశాల మేరకు 10 ఫ్రాంచైజీలు రిటైన్ అండ్ రిలీజ్ ప్లేయర్స్ లిస్టును బోర్డుకు అందజేసినట్లు సమాచారం. గత ఐపీఎల్ సీజన్లో అంతగా ప్రభావం చూపని ప్లేయర్లపై వేటు వేయాలని ఫ్రాంచైజీలు డిసైడ్‌ అయినట్లు తెలుస్తోంది. అలా వదలించుకోవాలనుకుంటున్న ఆటగాళ్ల లిస్టులో ఇంగ్లండ్‌ ప్లేయర్స్ ఎక్కువగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. భారీ ధర పలికిన జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్, హర్షల్ పటేల్, ఆండ్రీ రస్సెల్, పృథ్వీ షా తదితర స్టార్ ఆటగాళ్లను సైతం ఆయా ఫ్రాంచైజీలు వదిలేసినట్లు సమాచారం.

ఫ్రాంచైజీలు వదిలించుకోవాలనుకునే ప్లేయర్స్

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు

హర్షల్‌ పటేల్‌ - రూ 10 కోట్లు

దినేశ్‌ కార్తీక్‌ - రూ. 5.5 కోట్లు

అనూజ్‌ రావత్‌ - రూ. 3.4 కోట్లు

ఫిన్‌ అలెన్‌ - రూ.80 లక్షలు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

హ్యారీ​ బ్రూక్‌ - 13.25 కోట్లు

మయాంక్‌ అగర్వాల్‌ - 8.25 కోట్లు

ఆదిల్‌ రషీద్‌ - 2 కోట్లు

అకీల్‌ హొసేన్‌ - రూ. 1 కోటి

చెన్నై సూపర్‌ కింగ్స్‌:

బెన్‌ స్టోక్స్‌ - రూ. 16.25 కోట్లు

అంబటి రాయుడు - రూ. 6.75 కోట్లు

కైల్‌ జేమీసన్‌ - రూ. 1 కోటి

సిసండ మగాల - రూ. 50 లక్షలు

సిమ్రన్‌జీత్‌ సింగ్‌ రూ. 20 లక్షలు

షేక్‌ రషీద్‌ రూ. 20 లక్షలు

ఢిల్లీ క్యాపిటల్స్‌

పృథ్వీ షా - రూ. 7.5 కోట్లు

మనీశ్‌ పాండే - రూ. 2.4 కోట్లు

ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ - రూ. 1 కోటి

లుంగి ఎంగిడి - రూ. 50 లక్షలు

రిపల్‌ పటేల్‌ - రూ. 20 లక్షలు

గుజరాత్‌ టైటాన్స్‌

యశ్‌ దయాల్‌ - రూ. 3.2 కోట్లు

దసున్‌ షనక - రూ. 50 లక్షలు

ఓడియన్‌ స్మిత్‌ - రూ. 50 లక్షలు

ప్రదీప్‌ సాంగ్వాన్‌ - రూ. 20 లక్షలు

ఉర్విల్‌ పటేల్‌ ఝా - రూ. 20 లక్షలు

కోల్‌కతా నైట్‌రైడర్స్‌

ఆండ్రీ రసెల్‌ - రూ. 12 కోట్లు

లోకీ ఫెర్గూసన్‌ - రూ.10 కోట్లు

డేవిడ్‌ వీస్‌ - రూ. 1 కోటి

షకీబ్‌ అల్‌ హసన్‌ - రూ. 50 లక్షలు

జాన్సన్‌ చార్లెస్‌ - రూ. 50 లక్షలు

మన్‌దీప్‌ సింగ్‌ - రూ. 50 లక్షలు

లక్నో సూపర్‌ జెయింట్స్‌

ఆవేశ్‌ ఖాన్‌ - రూ.10 కోట్లు

డేనియల్‌ సామ్స్‌ - రూ. 75 లక్షలు

జయదేవ్‌ ఉనద్కత్‌ - రూ. 50 లక్షలు

రొమారియో షెపర్డ్‌ - రూ. 50 లక్షలు

సూర్యాంశ్‌ హేగ్డే - రూ. 20 లక్షలు

ముంబై ఇండియన్స్‌

జోఫ్రా ఆర్చర్‌ - రూ. 8 కోట్లు

క్రిస్‌ జోర్డన్‌ - రూ. 50 లక్షలు

డుయన్‌ జన్సెన్‌ - రూ. 20 లక్షలు

ట్రిస్టన్‌ స్టబ్స్‌ - రూ. 20 లక్షలు

అర్షద్‌ ఖాన్‌ - రూ. 20 లక్షలు

పంజాబ్‌ కింగ్స్‌

రాహుల్‌ చాహర్‌ - రూ. 5.2 కోట్లు

హర్ప్రీత్‌ భాటియా - రూ. 40 లక్షలు

మాథ్యూ షార్ట్‌ - రూ. 20 లక్షలు

బల్తేజ్‌ ధండా - రూ. 20 లక్షలు

రాజస్తాన్‌ రాయల్స్‌

జేసన్‌ హోల్డర్‌ - రూ. 5.75 కోట్లు

జో రూట్‌ - రూ. 1 కోటి

కరియప్ప - రూ. 30 లక్షలు

మురుగన్‌ అశ్విన్‌ - రూ. 20 లక్షలు

Updated : 12 Nov 2023 3:46 PM GMT
Tags:    
Next Story
Share it
Top