Home > క్రీడలు > మాట మార్చిన రికీ పాంటింగ్.. పంత్ రీఎంట్రీ కష్టమే

మాట మార్చిన రికీ పాంటింగ్.. పంత్ రీఎంట్రీ కష్టమే

మాట మార్చిన రికీ పాంటింగ్.. పంత్ రీఎంట్రీ కష్టమే
X

టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ కారు యాక్సిడెంట్ కు గురై.. రెండేళ్లుగా క్రికెట్ కు దూరమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పంత్ బెంగళూరులోని ఎన్సీఏ క్యాంపులో పర్యవేక్షణలో ఉన్నాడు. కాగా కోలుకున్న పంత్.. త్వరలోనే క్రికెట్ లో రీఎంట్రీ ఇస్తాడని వార్తలు వచ్చాయి. రానున్న ఐపీఎల్ 2024లో తప్పక రీఎంట్రీ ఇస్తాడని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ చాలాసార్లు చెప్పాడు. ప్రస్తుతం ఫిట్‌నెస్‌ కోసం నిరంతరం శ్రమిస్తున్న.. ఈసారి ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించొచ్చని ధీమా వ్యక్తం చేశాడు. అయితే తాజాగా ఈ విషయంలో రికీ పాంటింగ్ ఓ బాంబు పేల్చాడు. పంత్‌ పూర్తిగా అందుబాటులో ఉండాలని కోరుకుంటూనే.. అతని రీఎంట్రీపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని బాంబు పేల్చాడు.

పంత్ మెరుగ్గా తయారయ్యాడు. కానీ, పూర్తి సీజన్ అందుబాటులో ఉంటాడా? నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయగలడా? వికెట్ కీపింగ్ చేయగలడా? అనే చాలా సందేహాలు ఉన్నాయి. వాటిపై పంత్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. పంత్ కు సంబంధించిన ఏ విషయమైనా మాకు అడ్వాంటేజ్ ఉంటుందని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. పంత్ 2016లో IPL అరంగేట్రం చేసినప్పటి నుండి ఢిల్లీ క్యాపిటల్‌తో విడదీయరాని అనుబంధం ఉంది . ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ 98 మ్యాచ్‌ల్లో 147.97 స్ట్రైక్ రేట్‌తో 2838 పరుగులు చేశాడు.

Updated : 7 Feb 2024 9:55 PM IST
Tags:    
Next Story
Share it
Top