మ్యాచ్లో దంచి కొట్టిన రిషబ్ పంత్.. భారీ సిక్సర్లతో..
X
గతేడాది డిసెంబర్ లో రోడ్డు ప్రమాదం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ కోలుకుంటున్నాడు. జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడు. చేతి కర్ర, ఇతరుల సాయం లేకుండానే నడుస్తున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏలో ఫిట్ నెస్ సాధిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ.. సిద్ధమవుతున్నాడు. దీంతో పంత్ ఎలా ఉన్నాడు? తిరిగి జట్టులోకి ఎప్పుడు చేరతాడు? అనే ప్రశ్న అందరిలో మెదులుతోంది. ఈ ప్రశ్నకు త్వరలోనే సమాధానం రానుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జేఎస్ డబ్ల్యూ ఫౌండేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పంత్.. అక్కడ తన మాటలతో ప్రజల్లో స్పూర్తి నింపాడు.
ఆ కార్యక్రమం అనంతరం వాళ్లు నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ లో పాల్గొన్నాడు. బ్యాట్ పట్టి గ్రౌండ్ లో అడుగుపెట్టాడు. అలవోకగా సిక్సర్లు, ఫోర్లు బాదాడు. అది చూసిన నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాత పంత్ గుర్తొచ్చాడంటూ కామెంట్ చేస్తున్నారు. పంత్ త్వరగా కోలుకుంటాడని, మరికొద్ది రోజుల్లోనే పూర్తిస్థాయిలో ప్రాక్టీస్ మొదలుపెడతాడని ఆశిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే పంత్ రీఎంట్రీకి ఎక్కువ టైం పట్టేలా కనిపించడంలేదు. వచ్చే ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కు పూర్తి ఫిట్ నెస్ సాధించి జట్టులో చోటు సంపాధింస్తాడని భావిస్తున్నారు.
Rishabh Pant has resumed batting practice.
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 16, 2023
An excellent news for Indian cricket! pic.twitter.com/5I2Q6tsaeE