Home > క్రీడలు > Rohit Sharma : కెప్టెన్గా రోహిత్ తొలగింపు.. వైఫ్ రితికా రియాక్షన్ ఇదే..

Rohit Sharma : కెప్టెన్గా రోహిత్ తొలగింపు.. వైఫ్ రితికా రియాక్షన్ ఇదే..

Rohit Sharma  : కెప్టెన్గా రోహిత్ తొలగింపు.. వైఫ్ రితికా రియాక్షన్ ఇదే..
X

ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను కప్టెన్సీ నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది. 5 సార్లు ఐపీఎల్ కప్పులు అందించిన రోహిత్ను పక్కనబెట్టి.. హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు అందించింది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని కొంతమంది ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో పాండ్యా పేరును ప్రకటించిన వెంటనే ముంబై ఇండియన్స్ అఫీషియల్ ఎక్స్ పేజీని 4 లక్షల మంది అన్‌ఫాలో చేశారు. ఈ ఘటన తర్వాత రోహిత్ భార్య రితికా సజ్‌దేహ్‌ తొలిసారిగా సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది.

రోహిత్ను కప్టెన్సీ నుంచి తప్పించిన వెంటనే చెన్నై సూపర్ కింగ్స్ స్పెషల్ ట్వీట్ చేసింది. ‘‘2013 నుంచి 2023 దశాబ్దకాలంపాటు ఎన్నో సవాళ్లకు స్ఫూర్తిగా నిలిచావు. రోహిత్‌.. మీ మీద చాలా గౌరవం ఉంది’’ అంటూ ధోనీ - రోహిత్ ఫొటోను సీఎస్కే ట్వీట్ చేసింది. ఈ పోస్ట్‌కు రితికా ఎల్లో కలర్ హార్ట్ ఎమోజీని కామెంట్ చేసింది. దీనికి నెటిజన్ల నుంచి మస్త్ రెస్పాన్స్ వస్తోంది. ధోనీ సీఎస్కే మెంటర్‌గా మారి రోహిత్‌ను జట్టులోకి తీసుకుని కెప్టెన్‌ చేయాలని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు కెప్టెన్గా రోహిత్ లేని ముంబైని ఊహించలేకపోతున్నామని అంటున్నారు.


Updated : 17 Dec 2023 11:39 AM IST
Tags:    
Next Story
Share it
Top