Home > క్రీడలు > రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్.. టీమిండియా పరువు నిలబెట్టాడు

రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్.. టీమిండియా పరువు నిలబెట్టాడు

రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్.. టీమిండియా పరువు నిలబెట్టాడు
X

రాజ్ కోట్ వేదికపై టీమిండియా ఇంగ్లాండ్ కు గట్టి పోటీ ఇస్తుంది అనుకుంటే తేలిపోయింది. మొత్తం కుర్రాళ్లతో నిండిన జట్టు సొంతగడ్డపై ఇంగ్లాండ్ కు చెమటలు పట్టిస్తుంది అనుకుంటే చేతులెత్తేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. కేవలం 33 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. రెండో టెస్టు హీరో.. యశస్వి జైస్వాల్‌ కు ఈ మ్యాచ్‌లో మంచి స్టార్ట్‌ లభించలేదు. కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఔట్‌ అయ్యాడు. వన్‌డౌన్‌లో క్రీజ్‌లోకి వచ్చిన శుభ్ మన్‌ గిల్‌ డకౌట్‌ అయ్యాడు. ఆ వెంటనే రజత్‌ పాటిదార్‌ కూడా వికెట్‌ పారేసుకోవడంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో కెప్టెన్, ఓపెనర్ రోహిత్‌ శర్మ.. తన మాస్టర్‌ మైండ్‌ను ఉపయోగించాడు. ఒక్క ఐడియా టీమిండియా పరువు నిలబెట్టాడు.

మ్యాచ్ జరుగుతున్న తీరు చూస్తుంటూ టీమిండియా పేక మేడల్లా కూలిపోతుందేమో అనిపించింది. ఆ టైంలో రోహిత్ శర్మ ప్లాన్ వేసి.. తర్వాత వచ్చే బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ను ఆపేశాడు. అతని ప్లేస్ లో సీనియర్ లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్ రవీంద్ర జడేజాను రప్పించాడు. ఈ ఐడియా భారత్ ను గాడిలో పడేలా చేసింది. ఈ ఇద్దరూ కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ.. స్కోర్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ (97), జడేజా (68) ఉన్నారు. టీమిండియా 193 పరుగులతో పటిష్టంగా మారుతుంది. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 2, టామ్ హార్ ట్లే 1 వికెట్ పడగొట్టారు.





Updated : 15 Feb 2024 10:20 AM GMT
Tags:    
Next Story
Share it
Top