Rohit Sharma : రెండో టెస్ట్ విజయం.. ధోనీని అధిగమించిన రోహిత్ శర్మ
X
ఉప్పల్ ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంది. వైజాగ్ లో జరిగిన రెండో టెస్టులో గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. 106 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసి సిరీస్ 1-1తో సమం చేసుకుంది. భారత్ నిర్దేశించిన 399 పరుగుల లక్ష్యాన్ని చేదించలేక ఇంగ్లాండ్ చేతులెత్తేసింది. కుర్రాళ్లు గిల్, జైస్వాల్ అద్భుత సెంచరీలతో బ్యాటింగ్ లో సత్తా చాటగా.. సీనియర్లు అశ్విన్, బుమ్రా ఇంగ్లాండ్ కు కప్పకూల్చి విజయం సాధించారు. దీంతో వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ లో ఐదో స్థానంలో ఉన్న భారత్.. 2వ ప్లేస్ కు దూసుకెళ్లింది.
ఈ గెలుపుతో కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని అధిగమింయాడు. అదేంటంటే.. ఇంటర్నేషనల్ క్రికెట్ లో అత్యధిక విజయాల్లో పాలుపంచుకున్న టీమిండియా క్రికెటర్ల జాబితాలో రోహిత్ మూడో స్థానానికి చేరుకున్నాడు. క్రికెట్ హిస్టరీలో టీమిండియా విజయం సాధించిన మ్యాచుల్లో.. రోహిత్ 296 మ్యాచుల్లో సభ్యుడిగా ఉన్నాడు. ఈ లిస్ట్ లో ధోనీ (295)ని రోహిత్ శర్మ వెనక్కి నెట్టాడు. కాగా 313 మ్యాచుల గెలుపులో భాగమైన విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.. సచిన్ (307) రెండో స్థానంలో ఉన్నాడు. టీమిండియా 296 విజయాల్లో భాగస్వామ్యం పొందిన క్రికెటర్ గా రోహిత్ శర్మ నిలిచాడు