World cup 2023 : వరల్డ్ కప్లో రోహిత్ శర్మ మరో రికార్డు
X
వరల్డ్ కప్ ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా నిలిచాడు. 2019 ప్రపంచకప్‌లో కేన్ విలియమ్సన్ సాధించిన 578 పరుగుల రికార్డును రోహిత్ 29వ పరుగు పూర్తిచేసి దాటేశాడు. ఈ మ్యాచ్‌లో కొట్టిన 47 పరుగులతో.. ఈ టోర్నీలో రోహిత్ మొత్తం 597 రన్స్ చేశాడు.
ఈ వరల్డ్ కప్ సీజన్‌లో హిట్‌మ్యాన్ అరుదైన రికార్డులు బద్దలు కొట్టాడు. ఒక ప్రపంచకప్ టోర్నీలో తొలి 10 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ టోర్నీలో రోహిత్ మొత్తం 354 పరుగులు చేశాడు. ఇవాళ చేసిన 47 పరుగులతో కలిపి ఈ రికార్డు 401కి చేరింది. గతంలో ఈ రికార్డు 2015లో న్యూజిలాండ్ ఆటగాడు మెక్‌కల్లం (308) పేరిట ఉంది. 2003 ప్రపంచకప్ టోర్నీలో గిల్ క్రిస్ట్ కేవలం తొలి 10 ఓవర్లలోనే 276 పరుగులు చేశాడు.
ఇక ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన వారి లిస్టులో రోహిత్ ఫోర్త్ ప్లేస్ కు చేరుకున్నారు. ఈ టోర్నీల్లో మొత్తం 28 ఇన్నింగ్సుల్లో 1575 పరుగులు చేశాడు. శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర (1532)ను వెనక్కి నెట్టాడు. ప్రస్తుతం ఈ లిస్టులో సచిన్ (2278), కోహ్లీ (1752), పాంటింగ్ (1743) మాత్రమే రోహిత్ కన్నా ముందు ఉన్నారు. ఇక టోర్నీలో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడు కూడా రోహిత్ శర్మనే కావడం విశేషం. మొత్తం 11 మ్యాచ్‌ల్లో హిట్ మ్యాన్ 31 సిక్సులు కొట్టాడు.