Home > క్రీడలు > World Cup 2023: 63 బాల్స్లో అద్బుత సెంచరీ.. సిక్స్ల్లో వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన హిట్‌మ్యాన్‌

World Cup 2023: 63 బాల్స్లో అద్బుత సెంచరీ.. సిక్స్ల్లో వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన హిట్‌మ్యాన్‌

World Cup 2023: 63 బాల్స్లో అద్బుత సెంచరీ.. సిక్స్ల్లో వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన హిట్‌మ్యాన్‌
X

వన్డే ప్రపంచకప్ లో భాగంగా రెండో మ్యాచ్ ఆడుతున్న భారత్ ఢిల్లీ వేదికగా ఆప్ఘనిస్తాన్ తలపడుతోంది. టాస్‌ గెలిచిన అఫ్గానిస్థాన్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. 273 పరుగుల లక్ష్యంతో బరిలో దిగింది. ఫస్ట్ ఓవర్‌లో ఒక్క సింగిల్ మాత్రమే రాగా థర్డ్ ఓవర్ నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ షో మొదలైంది. చెలరేగి ఆడుతున్న రోహిత్ ఫోర్లు, సిక్సర్లతో అలరిస్తున్నాడు.

ఐదో ఓవర్‌లో ఫజల్ హక్ ఫరూకీ వేసిన రెండో బంతికి సిక్సర్ బాదిన రోహిత్ శర్మ.. వరల్డ్ కప్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అత్యంత వేగంగా 1000 వన్డే వరల్డ్ కప్ పరుగులు చేసిన బ్యాటర్‌గా డేవిడ్ వార్నర్ రికార్డును సమం చేశాడు. మరోవైపు ఎనిమిదో ఓవర్లో నవీనుల్ హక్ వేసిన నాల్గో బాల్ కు ఫోర్ బాది 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక ఐదో బంతికి సిక్స్ కొట్టిన రోహిత్ శర్మ ..అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్స్లు బాదిన క్రికెటర్గానూ చరిత్ర సృష్టించాడు. గతంలో క్రిస్ గేల్ (553 సిక్స్లు) పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. 18వ ఓవర్ లో మహమ్మద్ నబీ వేసిన మూడో బాల్కు సింగిల్ తీసిన రోహిత్ శర్మ 63 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.

Updated : 11 Oct 2023 7:52 PM IST
Tags:    
Next Story
Share it
Top