Home > క్రీడలు > Rohit Sharma : ఒకే ఇన్నింగ్స్తో మాజీ కెప్టెన్ల రికార్డులు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

Rohit Sharma : ఒకే ఇన్నింగ్స్తో మాజీ కెప్టెన్ల రికార్డులు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

Rohit Sharma : ఒకే ఇన్నింగ్స్తో మాజీ కెప్టెన్ల రికార్డులు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ
X

మొదటి రెండు టెస్టుల్లో దారుణంగా ఫెయిల్ అయిన హిట్ మ్యాన్.. కీలక మూడో టెస్ట్ మ్యాచ్ లో సత్తా చాటాడు. గాడి తప్పిన టీమిండియాను.. అద్భుత సెంచరీతో రేస్ లోకి తెచ్చాడు. ఈ ఇన్నింగ్స్ తో తనపై వచ్చిన విమర్శలన్నింటికీ సమాధానం చెప్పాడు. సెంచరీతో విమర్శకుల నోళ్లు మూయించాడు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఈ టైంలో సమయోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఓపికగా క్రీజులో కుదుర్కొని 131 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా పటిష్టంగా మారింది. కాగా ఈ ఇన్నింగ్స్ తో రోహిత్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ రికార్డులను చెరిపేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్లలో జాబితాలో గంగూలీని అధిగమించాడు. దాదా 16 ఏళ్ల కెరీర్ లో 421 మ్యాచులు ఆడి.. 18,575 పరుగులు చేశాడు.





రోహిత్ 470 మ్యాచుల్లో 18,600 పరుగులు చేశాడు. రాజ్ కోట్ టెస్టులో 65 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ ఈ ఫీట్ ను అందుకున్నాడు. ఈ జాబితాలో సచిన్ అగ్రస్థానంలో నిలవగా.. కోహ్లీ రెండో ప్లేసులో ఉన్నాడు. కాగా ఈ ఇన్నింగ్స్ తో రోహిత్.. ధోనీ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఈ ఇన్నింగ్స్ లో రెండు సిక్సర్లు కొట్టిన రోహిత్.. దీంతో టీమిండియా తరఫున టెస్టులలో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో బ్యాటర్‌గా రోహిత్ నిలిచాడు. టెస్టులలో ధోని ఖాతాలో 78 సిక్సర్లుండగా.. రోహిత్‌ 80 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్‌.. 90 సిక్సర్లతో అగ్రస్థానంలో నిలిచాడు.





అంతర్జాతీయ క్రికెట్ లో భారత్‌ తరఫున అత్యధిక రన్స్ చేసిన వారు:

1. సచిన్‌ టెండూల్కర్‌ - 782 ఇన్నింగ్స్‌ల్లో 34,357 పరుగులు

2. విరాట్‌ కోహ్లీ - 580 ఇన్నింగ్స్‌ల్లో 26,733

3. రాహుల్‌ ద్రావిడ్‌- 599 ఇన్నింగ్స్‌ల్లో 24,064

4. రోహిత్‌ శర్మ - 470 ఇన్నింగ్స్‌ల్లో 18,600

5. సౌరవ్‌ గంగూలీ - 485 ఇన్నింగ్స్‌లలో 18,575




Updated : 16 Feb 2024 7:11 AM IST
Tags:    
Next Story
Share it
Top