చెలరేగిన రోహిత్ శర్మ.. గాడినపడ్డ టీమిండియా
X
మొదటి రెండు టెస్టుల్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. గత టెస్ట్ ఇన్నింగ్స్ లు చూసుకుంటే.. ఒక్క సెంచరీ కూడా లేదు. కెప్టెన్సీలోనూ రాణించట్లేదు. వరుస ఓటములు, బ్యాటింగ్ వైఫల్యం. సొంత గడ్డపైన కూడా తేలిపోతున్నాడు. గడిచిన 8 మ్యాచుల్లో చూసుకుంటే.. 80,57,5,0,39,16,24,39 పరుగులు మాత్రమే చేశాడు. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ కు పాయింట్స్ టేబుల్ లో భారత్ స్థానం పడిపోతుంది. కెప్టెన్ గా, బ్యాటర్ గా జట్టుకు భారం అవుతున్నాడు. టీం నుంచి తప్పుకుంటే బెటర్.. ఈ సిరీస్ లో రోహిత్ శర్మపై వచ్చిన విమర్శలివి. ఈ మ్యాచుతో వాటన్నింటికీ సమాధానం చెప్పాడు. తన అద్భుత సెంచరీతో విమర్శకుల నోళ్లు మూయించాడు. పడిపోతున్న టీమిండియాను నిలబెట్టాడు. రవీంత్ర జడేజాతో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. కేవలం 33 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. రెండో టెస్టు హీరో.. యశస్వి జైస్వాల్ కు ఈ మ్యాచ్‌లో మంచి స్టార్ట్ లభించలేదు. కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో క్రీజ్‌లోకి వచ్చిన శుభ్ మన్ గిల్ డకౌట్ అయ్యాడు. ఆ వెంటనే రజత్ పాటిదార్ కూడా వికెట్ పారేసుకోవడంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ టైంలో రోహిత్ శర్మ సమయోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఓపికగా క్రీజులో కుదుర్కొని (114, 181 బంతుల్లో, నాటౌట్), జడేజా (78 నాటౌట్) స్కోర్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు. దీంతో టీమిండియా 214/3 పరుగులతో పటిష్టంగా మారుతుంది. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 2, టామ్ హార్ ట్లే 1 వికెట్ పడగొట్టారు.