సెనా పిచ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన రోహిత్ శర్మ
X
సౌతాఫ్రికా టూర్ లో భాగంగా జరుగుతున్న రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో.. టీమిండియా మొదటి మ్యాచ్ ఓడిపోయింది. మ్యాచ్ కు ముందు సరైన సన్నద్ధత లేకపోవడం వల్లే భారత్ ఓడిపోయిందనే చాలామంది విమర్శించారు. ఈ వాదనను కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిపడేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ప్రాక్టీస్ టెస్టుల వల్ల.. అసలైన మ్యాచుల్లో పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని అన్నాడు. ఇంట్రా స్క్వాడ్ పోటీల కోసం ప్రాక్టీస్ మ్యాచ్ లను నిలిపేయడంపై వచ్చని ప్రశ్నలపై రోహిత్ శర్మ ఇలా స్పందించాడు.
‘గత నాలుగైదు సంవత్సరాలుగా మేము చాలా ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడాం. ఫస్ట్ క్లాస్ టెస్టుల్లోనూ పాల్గొన్నాం. ఈ మ్యాచ్ ల కోసం అసలైన టెస్టుల్లో ఆడే పిచ్ లను వాడరు. అందుకే, వాటికి దూరంగా ఉండి.. మాకు అవసరమైన పిచ్ లపై దృష్టి సారించాం. అనుకూలమైన వాటిని తయారుచేసుకుని ప్రాక్టీస్ చేశాం. గతంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వెళ్లినప్పుడు కూడా ఇలానే చేశాం. అలా తయారు చేయించిన పిచ్ లపై బాల్స్ ఎక్కువగా బౌన్స్ కావు. కానీ అసలైన మ్యాచ్ కు వచ్చేసరికి పరిస్థితి మారిపోతుంది. తలపైకి బంతులు వస్తుంటాయి. అందుకే మాకు కావాల్సిన పిచ్ లు తయారు చేయించుకుని ప్రాక్టీస్ చేశాం. మెయిన్ మ్యాచ్ లో ఉన్నట్లాంటి పిచ్ లు ప్రాక్టీస్ మ్యాచ్ లో ఉంటే ఓకే. మేం ఆడగలుగుతాం’అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.