IND vs AUS: మహా సంగ్రామానికి ముందు మాటల యుద్ధం.. రోహిత్ కౌంటర్తో హీటెక్కిన వాతావరణం
X
ప్రపంచకప్ మహాసంగ్రామినికి ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది. రోహిత్ సేన్ ట్రోఫి ఎత్తుతుంటే చూడాలని.. 150 కోట్ల మంది ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు కెప్టెన్ల మధ్య మాటల యుద్ధం మ్యాచ్ కు ముందు హీట్ పెంచింది. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ చేసిన వ్యాఖ్యలకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. తమకు అదనపు బలం ఉందన్న కమ్మిన్స్ వ్యాఖ్యలను రోహిత్ తిప్పికొట్టాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన కమ్మిన్స్ తమ జట్టులో 2015 వరల్డ్ కప్ లో ఆడిన ప్లేయర్లు ఉన్నారని, వారి అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాడు. అంతేకాకుండా మోదీ స్టేడియంలో లక్షా 30 వేల మంది ప్రేక్షకుల నోళ్లను మూయిస్తామన్నాడు కమ్మిన్స్. ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన రోహిత్ ఇలా అన్నాడు....
‘వరల్డ్ కప్ గతంలో గెలిచిన ఆటగాళ్లు ఉండటాన్ని అడ్వాంటేజ్ అనడం ఫూలిష్ తింగ్. ఆ విషయాన్ని మేం నమ్మం. ఫైనల్ ఆడిన అనుభవం కంటే ప్రస్తుత ఆటగాడున్న ఫామ్, మన ఆలోచనా తీరు చాలా ముఖ్యం. వారు ఒత్తిడిని ఎలా తట్టుకోగలరు అనేది అత్యంతకీలకం. కమిన్స్ ఏ కోణంలో ఈ మాట అన్నాడో నాకు అర్థమైంది. నా అభిప్రాయం ప్రకారం వారికి ఎటువంటి అడ్వాంటేజ్ ఉండదు. ఎవరు ఎవరి నోళ్లు మూయిస్తారో చూద్దాం. కాన్ఫిడెంట్ ను చూపించడాన్ని నేనేం తప్పుపట్టను. ఆసీస్ టోర్నీ ఆరంభంలో తడబడ్డా.. తర్వాత పుంజుకుని వరుస విజయాలు సాధించింది. సెమీస్ లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేసిందో తెలిసిందే. వాళ్లు మాకు సమవుజ్జీలు’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. కాగా, 2003 వరల్డ్ కప్, 2023 వరల్డ్ టెస్ట్ చాంపియన్స్ లీగ్ లో ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.