Home > క్రీడలు > ధోనీ రికార్డ్పై కన్నేసిన కెప్టెన్.. ఇంకా ఒక్క అడుగు దూరంలో

ధోనీ రికార్డ్పై కన్నేసిన కెప్టెన్.. ఇంకా ఒక్క అడుగు దూరంలో

ధోనీ రికార్డ్పై కన్నేసిన కెప్టెన్.. ఇంకా ఒక్క అడుగు దూరంలో
X

సెంచూరియన్ వేదికగా మంగళవారం (డిసెంబర్ 26) నుంచి భారత్- సౌతాఫ్రికా మధ్య జరిగో బాక్సింగ్ డే టెస్ట్ కు రంగం సిద్ధం అయింది. కొత్త కెప్టెన్, కొందరు కొత్త ప్లేయర్లతో ఈ సిరీస్ లో భారత్ ఆడబోతోంది. కాగా గత మూడు దశాబ్దాలుగా సఫారీ గడ్డపై టెస్ట్ సీరీస్ నెగ్గని టీమిండియా.. ఈసారి రోహిత్ కెప్టెన్సీలో గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ప్లేయర్లంతా నెట్స్ లో శ్రమిస్తున్నారు. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ మైలు రాయిని అందుకోనున్నాడు. మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న రికార్డ్ పై కన్నేశాడు.

టీమిండియా తరుపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో తొలి స్థానంలో మాజీ డాషింగ్ ఓపెనర్ వీరెంద్ర సెహ్వాగ్ (178 ఇన్నింగ్స్ ల్లో 90 సిక్సర్లు) మొదటి స్థానంలో ఉన్నాడు. తర్వాత స్థానంలో ధోనీ (144 ఇన్నింగ్స్ లో 78 సిక్సర్లు) రెండో స్థానంలో నిలిచాడు. అయితే రోహిత్ శర్మ (88 ఇన్నింగ్స్ ల్లో 77 సిక్సర్లు) మూడో స్థానంలో ఉన్నాడు. తొలి టెస్ట్ లో రోహిత్ ఒక సిక్స్ కొడితే.. ధోనీ సరసన చేరతాడు. అది కూడా తక్కువ ఇన్నింగ్సుల్లో. అదే రెండు సిక్సర్లు కొడితే.. ధోనీని అదిగమించి రెండో స్థానానికి చేరుకుంటాడు. ఈ మ్యాచ్ ద్వారా ఆ రికార్డును అధిగమించాలని రోహిత్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

టెస్టు సిరీస్ షెడ్యూల్:

తొలి టెస్టు- డిసెంబరు 26 - 30 వరకు- సెంచురియాన్‌ (మధ్యాహ్నం 1:30- భారతీయ కాలమానం ప్రకారం)

రెండో టెస్టు- జనవరి 03 - 07 వరకు- కేప్‌టౌన్ (మధ్యాహ్నం 2:00- భారతీయ కాలమానం ప్రకారం)

భారత్‌ జట్టు :

రోహిత్ శర్మ (c), శుభ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముకేశ్‌ కుమార్, జస్‌ప్రిత్ బుమ్రా (v/c), ప్రసిద్ధ్ కృష్ణ.

Updated : 26 Dec 2023 7:21 AM IST
Tags:    
Next Story
Share it
Top