Home > క్రీడలు > Rohit Sharma : జట్టుకు భారమవుతున్న కెప్టెన్.. 5 మ్యాచ్ల్లో.. 4 పరుగులు, 4 డకౌట్లు

Rohit Sharma : జట్టుకు భారమవుతున్న కెప్టెన్.. 5 మ్యాచ్ల్లో.. 4 పరుగులు, 4 డకౌట్లు

Rohit Sharma : జట్టుకు భారమవుతున్న కెప్టెన్.. 5 మ్యాచ్ల్లో.. 4 పరుగులు, 4 డకౌట్లు
X

టీమిండియా టీ20 జట్టు ప్రపంచ క్రికెట్ లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. వరుసగా 15 సిరీసుల్లో నెగ్గి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. అయితే 2007 టీ20 వరల్డ్ కప్ తరహాలో.. మొత్తం కుర్రాళ్లతోనే జట్టును నడిపించాలని మొదట బీసీసీఐ భావించింది. అందుకే సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను 14 నెలల పాటు జట్టుకు దూరంగా ఉంచింది. కానీ, అనూహ్యంగా టీ20 వరల్డ్ కప్ కు 5 నెలల ముందు మళ్లీ వారిని తిరిగి జట్టులోకి తీసుకుంది. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ తో జరుతున్న టీ20 సిరీస్ లో విరాట్ కోహ్లీ రాణించినా.. రోహిత్ శర్మ మాత్రం దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. మొదటి రెండు మ్యాచుల్లో డకౌట్ అయి నిరాశ పరిచాడు. ముఖ్యంగా ఛేజింగ్ లో రోహిత్ చివరి అయిదు ఇన్నింగ్స్ లను చూసుకుంటే ఏకంగా నాలుగు సార్లు డకౌటయ్యాడు. దీంతో బీసీసీఐ సెలక్టర్లలో మళ్లీ ఆందోళన మొదలైంది.





ఆఫ్ఘాన్ తో జరిగిన రెండో టీ20లో బాధ్యత లేకుండా ఆడిన చెత్త షాట్ తో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో క్రికెట్ విశ్లేషకులు రోహిత్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. సీనియర్ ప్లేయర్ గా జట్టును ముందుండి నడిపించాల్సిన హిట్ మ్యాన్.. ఇలా భారమవడం జట్టుకు ఇబ్బంది కలిగించే విషయమే. వెస్టిండీస్, అమెరికా సంయుక్త వేదికలపై జరుగుతున్న 2024 టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ కెప్టెన్ అని దాదాపు ఖరారైంది. ఈ వరల్డ్ కప్ ను సీరియస్ గా తీసుకున్న టీమిండియా ఎలాగైనా కప్పు గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇలాంటి సమయంలో రోహిత్ ఫెయిల్ అవడం జట్టులో కలవరాన్ని సృష్టిస్తుంది.




Updated : 16 Jan 2024 11:44 AM IST
Tags:    
Next Story
Share it
Top