నా రిటైర్మెంట్ అప్పుడే..రోహిత్ శర్మ
X
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో జట్టు అద్భుతంగా రాణిస్తోంది. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సీరిస్ లో కుర్రాళ్లతో కలిసి టీమిండియాకు భారీ విజయాన్ని అందించాడు. అయితే తాజాగా తన రిటైర్మెంట్ గురించి హిట్ మ్యాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనలో ఇంకా ఆట మిగిలే ఉందని అన్నాడు. తన ఆట బాగాలేదని అనిపించిన రోజు వెంటనే క్రికెట్ కు గుడ్ బై చెప్పేస్తానని తెలిపాడు. తాజాగా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్‌తో జరిగిన ఇంటర్వ్యూలో రోహిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
తాను సరిగ్గా ఆడటం లేదని అనుకున్నప్పుడు ఈ విషయాన్ని టీమ్ మేనేజ్‌మెంట్‌కు చెప్పి రిటైర్ అవుతానని అన్నాడు. కానీ నిజాయతీగా చెప్పాలంటే గత రెండు, మూడు ఏళ్లుగా తన ఆట మరింత మెరుగైందని చెప్పుకొచ్చాడు. గతంలో కన్నా అత్యుత్తమ ఆట తీరును కనబరుస్తున్నానని చెప్పాడు. తాను లెక్కలు, రికార్డుల గురించి పెద్దగా పట్టించుకునే వ్యక్తిని కాదని తేల్చి చెప్పాడు. సెంచరీలు, పెద్ద స్కోర్ లు చేయడం ముఖ్యమే కానీ జట్టు అవసరాలకు తగ్గట్టు ఆడటంపై దృష్టిపెట్టానన్నావడు. తాను జట్టులో కొంత మార్పు తీసుకురావాలనుకుంటున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం క్రికెటర్లు చాలా స్వేచ్ఛగా ఆడుతున్నారని చెప్పాడు. వ్యక్తిగత స్కోర్లు ముఖ్యం కాదని...భయం లేకుండా, మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఆడితే పరుగులు వాటంతట అవే వస్తాయని రోహిత్ శర్మ చెప్పాడు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.