రిటైర్మెంట్‌పై కీలక ప్రకటన చేసిన రోహిత్ శర్మ
X
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై గతకొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎవరికి ఇష్టమున్నట్లు వాళ్లు తమ అభిప్రాయాలను చెప్తున్నారు. ప్రస్తుతం 36 ఏళ్ల రోహిత్ తన రిటైర్మెంట్ పై కీలక ప్రకటన చేశాడు. అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఏడాది జూన్ లో జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. రోహిత్ టీ20లు ఆడక దాదాపు 9 నెలలవుతోంది. సెలక్టర్లు సీనియర్లను టీ20లకు దూరం పెట్టినట్లు తెలుస్తున్నా.. రోహిత్ మాత్రం టీ20 వరల్డ్ కప్ పై ఆశలు పెట్టుకున్నాడు. ఇధి తెలిసిన ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అందులో ఇప్పట్లో ఏ ఫార్మట్ నుంచి రిటైర్ అయ్యే అవకాశం లేదని, రాబోయే వరల్డ్ కప్ కు అందుబాటులో ఉంటున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం తన దృష్టంతా వన్డే వరల్డ్ కప్ పై పెట్టినట్లు చెప్పాడు. ఈ క్రమంలో కొందరు ఇవన్ని ఉట్టిమాటలంటూ కొట్టి పడేస్తున్నారు. ‘ప్రస్తుతం రోహిత్ కు 36.. వచ్చే ఏడుకు 37 నిండుతాయి. అప్పటికి ఫిట్ గా ఉంటాడో లేదో తెలియదు. అంతేకాకుండా టీ20 వరల్డ్ కప్ 2022 నుంచి సెలక్టర్లు రోహిత్ ను ఒక్క సిరీస్ లోనూ ఎంపిక చేయలేదు. విండీస్ సిరీస్ కు పూర్తిగా కుర్రాళ్లతో ఆడిస్తున్నారు. ఈ క్రమంలో రోహిత్ ను మళ్లీ టీ20ల్లో చూస్తామని అనుకోవట్లేదం’టూ కామెంట్ చేస్తున్నారు.
Captain Rohit Sharma said, " We've a T20I world cup coming in June 2024. It'll be pretty exciting and we're looking forward to it."
— Nisha (@NishaRo45_) August 6, 2023
There's a hope Rohit Sharma will decide to play next t20i world cup 🤞pic.twitter.com/1aYQRATlP4