Home > క్రీడలు > ఈ వరల్డ్కప్లో అదే మా బలం.. అందుకే టీంకు దూరంగా ఉన్నా

ఈ వరల్డ్కప్లో అదే మా బలం.. అందుకే టీంకు దూరంగా ఉన్నా

ఈ వరల్డ్కప్లో అదే మా బలం.. అందుకే టీంకు దూరంగా ఉన్నా
X

వరల్డ్ కప్ కు ఇంకా రెండు నెలల సమయమే ఉంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈసారి స్వదేశంలో టోర్నీ జరుగుతుండగా.. టీంపై భారీ ఎత్తున అంచనాలు నెలకొన్నాయి. సొంత గడ్డపై టీమిండియా అదరగొట్టి కప్పు గెలిస్తే చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో 2011 ప్రదర్శనను పునరావృతం చేస్తామని కెప్టెన్ రోహిత్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు. అమెరికాలో జరిగిన ఐసీసీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్.. జట్టునుద్దేశించి మాట్లాడాడు.

‘వరల్డ్ కప్ ను ఇంత దగ్గరగా చూడటం ఇదే ఫస్ట్ టైం. ఈసారి స్వదేశంలో జరిగే టోర్నీలో ట్రోఫీని ఇంటికి తీసుకుపోతా. 12 ఏళ్ల నిరీక్షనకు ఈసారి తెరదించబోతున్నాం. ఇప్పటివరకు ప్రతీ టోర్నీలో భారత ఆటగాళ్లు అద్భుత ప్రతిభ కనబరిచారు. కానీ, కొన్ని పొరపాట్ల వల్ల ఓడిపోయాం. అది ఈసారి రిపీట్ కాదు. 2011 వరల్డ్ కప్ లో చోటు దక్కనందుకు ఫీల్ అయ్యా. అసలు మ్యాచ్ లు చూడొద్దనుకున్నా. క్వార్టర్స్ నుంచి మా జట్టు అద్భుతంగా ఆడింది. అదే స్పూర్తితో బరిలోకి దిగుతాం. 2015, 2019లో టీంలో ఉన్నా జట్టును ఫైనల్ చేర్చలేకపోయా’ అంటూ చెప్పుకొచ్చాడు.

అందుకే టీ20లకు దూరం:

సీనియర్ ప్లేయర్లు టీ20ల్లో ఆడకపోవడంపై స్పదించిన రోహిత్.. కీలక వ్యాఖ్యలు చేశాడు. మరో రెండు నెలల్లో జరిగే వన్డే ప్రపంచకప్ ను దృష్టిలో పెట్టుకుని.. పనిభారం తగ్గించుకోవడం కోసం టీ20ల నుంచి విశ్రాంతి తీసుకుంటున్నామని చెప్పాడు. కొంతమంది సీనియర్లకు అన్ని ఫార్మాట్లలో ఆడటం కష్టం. అందుకే జట్టుకు దూరం అయ్యాం అన్నాడు.

Updated : 8 Aug 2023 2:41 PM IST
Tags:    
Next Story
Share it
Top