Home > క్రీడలు > Rohit Sharma : ఇంగ్లాండ్ను చిత్తు చేసిన భారత్.. రోహిత్ ఏమన్నాడంటే..?

Rohit Sharma : ఇంగ్లాండ్ను చిత్తు చేసిన భారత్.. రోహిత్ ఏమన్నాడంటే..?

Rohit Sharma : ఇంగ్లాండ్ను చిత్తు చేసిన భారత్.. రోహిత్ ఏమన్నాడంటే..?
X

మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ను భారత్ చిత్తు చేసింది. 434 రన్స్ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. 122 రన్స్కే ఆలౌట్ అయ్యింది. భారత్ బౌలర్ల దెబ్బకు ఇంగ్లీష్ జట్టు బ్యాట్స్మెన్స్ వరుసగా పెవిలియన్ బాట పట్టారు. మార్క్ వుడ్ (33) మినహా మిగితా బ్యాట్స్మెన్లు 20 రన్స్ కూడా చేయలేకపోయారు. ఆరుగురు బ్యాట్స్మెన్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. రవీంద్ర జడేజా 5వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ఈ గెలుపుపై కెప్టెన్ రోహిత్ స్పందించారు.

బౌలర్ల ప్రదర్శన చూసి గర్వపడ్డానని రోహిత్ అన్నారు. అశ్విన్ లేకున్నా బౌలర్లు అద్భుతంగా రాణించారని చెప్పారు. రెండో రోజు ఇంగ్లాండ్ బౌలర్లపై ఒత్తిడి పెంచితే.. ఆ తర్వాతి రోజు బౌలర్లు అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చారన్నారు. ఇక జడేజా బాల్ తో పాటు బ్యాట్ తోనూ రాణిస్తాడని ముందే ఊహించినట్లు రోహిత్ తెలిపారు. జడ్డు తన సత్తాను మరోసారి చాటాడన్నారు. సర్ఫరాజ్ ఎంట్రీతోనే అదరగొట్టాడని అభినందించాడు. జైశ్వాల్, గిల్ జట్టుకు కావాల్సిన లీడ్ను అందించారని అన్నారు.

వరల్డ్ క్రికెట్ను ఏలుతాడు

ఇక జైశ్వాల్ ఒక అద్భుతమని రోహిత్ అన్నాడు. భవిష్యత్ లో అతడు వరల్డ్ క్రికెట్ను ఏలుతాడని చెప్పాడు. ఇప్పటికే ఈ విషయం చాలా సార్లు చెప్పినట్లు గుర్తుచేశాడు. టాస్ సైతం తమ గెలుపులో కీలక పాత్ర పోషించిందని వివరించాడు. కాగా తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో పాటు 2వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టిన జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రెండో ఇన్నింగ్స్ లో జైశ్వాల్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. రెండో టెస్టులో ఇంగ్లాడ్పై డబుల్ సెంచరీ చేసిన అతడు.. మూడో టెస్టులోనూ అదే రిపీట్ చేశాడు. దీంతో సొంత గడ్డపై ఒక సిరీస్‌లో 500+ రన్స్‌ చేసిన రెండో భారత బ్యాటర్‌ జైస్వాల్గా నిలిచాడు.

Updated : 18 Feb 2024 1:59 PM GMT
Tags:    
Next Story
Share it
Top