టీ20 వరల్డ్కప్ నాకూ ఆడాలనే ఉంది కానీ..!: రోహిత్ శర్మ
X
మరో నాలుగైదు నెలల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం అవుతుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్త వేదికలపై జరిగే ఈ మెగా టోర్నీపై భారత్ కన్నేసింది. ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించి, హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో బీసీసీఐ ఉంది. అందుకే గత టీ20 వరల్డ్ కప్ నుంచి రోహిత్, విరాట్ కోహ్లీలను.. బీసీసీఐ టీ20 జట్టుకు దూరంగా ఉంచుతోంది. ఈ విషయంపై మాట్లాడిన రోహిత్ శర్మ.. తనకూ టీ20 వరల్డ్ కప్ ఆడాలని ఉందని, కానీ తుది నిర్ణయం తన చేతుల్లో లేదని చెప్పుకొచ్చాడు.
సౌతాఫ్రికా గడ్డపై రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా.. ఇవాళ మొదటి మ్యాచ్ ఆడుతోంది టీమిండియా. మ్యాచ్ కు ముందు మీడియా సమావేశంలో మాట్లాడిన కెప్టెన్ రోహిత్.. తన టీ20 భవిష్యత్తు గురించి స్పందించాడు. ‘నాకు ఆడేందుకు అవకాశం ఉన్న ప్రతీచోట్లా క్రికెట్ ఆడతా. అందరికీ ఆడాలనే ఉంటుంది. నా టీ20 కెరీర్ గురించి మీకు త్వరలో సమాధానం లభిస్తుంద’ని చెప్పుకొచ్చాడు.
Rohit Sharma on T20 World Cup 2024 pic.twitter.com/dxSNqbXxPY
— Awadhesh Mishra (@sportswalaguy) December 25, 2023