Home > క్రీడలు > పోటీ తీవ్రంగా ఉంది.. ఈసారి కప్పు గెలవడం అంత ఈజీ కాదు

పోటీ తీవ్రంగా ఉంది.. ఈసారి కప్పు గెలవడం అంత ఈజీ కాదు

పోటీ తీవ్రంగా ఉంది.. ఈసారి కప్పు గెలవడం అంత ఈజీ కాదు
X

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల అయింది. 12 ఏళ్ల తర్వాత టీమిండియా సొంతగడ్డపై వరల్డ్ కప్ ఆడుతోంది. ఈ క్రమంలో ఆటగాళ్లపై ఒత్తిడి రావడంలో సందేహం లేదు. తమ జట్టు గెలవాలని, తమ ఆటగాళ్లు గెలిపిస్తారని ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ముందు బరిలోకి దిగడం అనేది కాస్త కష్టమైంది. ఈ సమయంలో ఆటగాళ్లు తమ శక్తికి మించి పోరాడాలి. అత్యుత్తమ ప్రదర్శన చేయాలి. వీటన్నింటికి మించి ఒత్తిడిని ఎదుర్కోవాలి. ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శన ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఆటగాళ్ల ప్రదర్శనే కాకుండా.. కీలక టోర్నోల్లో చేతులెత్తేయడం టీంకు అలవాటయింది. ఈ మధ్య పాల్గొన్న చాలా టోర్నీల్లో నాకౌంట్ స్టేజ్ లోనే ఇంటి ముఖం పడుతోంది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

‘‘స్వదేశంలో వరల్డ్ కప్‌ ఆడడం గొప్ప అనుభవం. 12 ఏళ్ల క్రితం స్వదేశంలో జరిగిన టోర్నీలో భారత్ కప్పు గెలిచింది. ఈసారి కూడా టీమిండియా గెలవాలని అభిమానులు కచ్చితంగా కోరుకుంటారు. అప్పటితో పోల్చితే ఇప్పుడు ఆట చాలావరకు మారింది. ఆటలో వేగం పుంజుకుంది. దీంతో ఈ ప్రపంచకప్‌లో గట్టి పోటీ ఉండబోతోంది. జట్లు కూడా గతంలో కంటే ఇప్పుడు సానుకూలంగా ఆడుతున్నాయి. ఇదివరకటిలా అనుకున్నంత ఈజీగా విజయాలు రావు. వరల్డ్ కప్ లో పాల్గొనే ప్రతి జట్టు ఫేవరెటే. కప్పు ప్రతి అభిమానిని ఊరిస్తోంది. మేము ఈ టోర్నీలో బాగా ఆడటానికి సిద్ధమవుతున్నాం. మా అత్యుత్తమ స్థాయికి చేరుకుని గెలవడానికి ప్రయత్నిస్తామ’’ని రోహిత్ శర్మ అన్నాడు. ఈ మెసేజ్ ను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

Updated : 27 Jun 2023 10:36 PM IST
Tags:    
Next Story
Share it
Top