Home > క్రీడలు > Back To T20s : ముగిసిన చర్చలు.. బీసీసీఐకి తేల్చి చెప్పిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ

Back To T20s : ముగిసిన చర్చలు.. బీసీసీఐకి తేల్చి చెప్పిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ

Back To T20s : ముగిసిన చర్చలు.. బీసీసీఐకి తేల్చి చెప్పిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
X

2022 టీ20 వరల్డ్ కప్ తర్వాత నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 ఫార్మట్ కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి వీరిని ద్వైపాక్షిక సిరీస్ లకు దూరంగా ఉంచుతూ, హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించి కుర్రాళ్లకు చాన్స్ లు ఇచ్చింది బీసీసీఐ. దాంతో రోహిత్, కోహ్లీలు ఇద్దరు తమ చివరి టీ20 మ్యాచ్ ఆడేశారని, ఇక టీ20 ఫార్మట్ కు రిటైర్మెంట్ ఇచ్చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. పొట్టి ఫార్మట్ లో ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రోహిత్, కోహ్లీలు బీసీసీఐ తెలిపారు. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ముగిసిన అనంతరం.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో పాటు సెలక్టర్లు శివ్‌సుందర్‌ దాస్‌, సలీల్‌ అంకోలాలతో.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో వీరి టీ20 ఫార్మట్ భవితవ్యంపై చర్చలు జరిగాయి. కాగా టీ20లు ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ విషయంలో వారికి ఎటువంటి ఇబ్బంది లేదని సెలక్టర్లకు తెలిపారు. దీంతో ఈ ఏడాది వెస్టిండీస్, అమెరికా వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ కు వీరిద్దరి మార్గం సుగమైంది. దీంతో రోహిత్ శర్మకే టీ20 పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. జనవరి 11 నుంచి స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోయే మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు బీసీసీఐ సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ సిరీస్ లో రోహిత్, కోహ్లీలను ఎంపిక చేసే అవకాశం ఉంది. రెండు మూడు రోజుల్లో జట్టును ప్రకటిస్తారు.



Updated : 5 Jan 2024 7:22 AM GMT
Tags:    
Next Story
Share it
Top