Selfish Jadeja:ఎంతపని చేశావు జడేజా.. పాపం సర్ఫరాజ్ (వీడియో వైరల్)
X
టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను దురదృష్టం వెంటాడింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియాలో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్.. మెరుపు అర్ధ శతకం సాధించాడు. న ఈ ముంబై బ్యాటర్ రనౌట్‌గా వెనుదిరగడం అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. ఏ మాత్రం బెరుకు లేకుండా అద్భుతంగా ఆడాడు. తనను ఎందుకు సెలక్ట్ చేయలేదని బ్యాటుతో ప్రశ్నించాడు. కేవలం 48 బంతుల్లోనే 50 పరుగులు పూర్తిచేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ లో మొత్తం 62 పరుగులు చేశాడు. భారీ స్కోర్ చేయడం ఖాయం అనుకున్న క్రమంలో పొరపాటున రన్ ఔట్ అయి.. పెవిలియన్ చేరాడు. కాగా సర్ఫరాజ్ రన్ ఔట్ అయిన క్షణంలో కెప్టెన్ రోహిత్ శర్మ కోపంతో ఊగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అండర్సన్ బౌలింగ్ చేస్తుండగా.. జడేజా సెంచరీకి ఇంకా ఒక్క పరుగు మాత్రమే కావాలి. ఈ టైంలో లాంగ్ వైపు కవర్ డ్రైవ్ ఆడిన జడ్డూ.. మొదట రన్ కు కాల్ ఇచ్చాడు. బాల్ ఫీల్డర్ చేతికి రాగానే నో చెప్తూ.. క్రీజులోకి వెళ్లిపోయాడు. ఈ గ్యాప్ లో పిచ్ లో సగం దూరం పరిగెత్తిన సర్ఫరాజ్ తిరిగి చేరుకోవడం సాధ్యపడలేదు. అంతలో మార్క్ వుడ్ బంతిని అందుకుని వికెట్లను గిరాటేశాడు. దీంతో సర్ఫరాజ్ ఇన్నింగ్స్ కు తెరపడింది. ఈ రన్ ఔట్ పై రోహిత్ అసహనం వ్యక్తం చేశాడు. తన క్యాప్ ను నేలకేసి కొట్టాడు. ఈ క్రమంలో జడేజాపై నెటిజన్స్ మండిపడుతున్నారు. సెల్ఫిష్ జడేజా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.