Home > క్రీడలు > Rohit Sharma : టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్.. ఇక వన్డే, టెస్ట్ కెప్టెన్గానే!

Rohit Sharma : టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్.. ఇక వన్డే, టెస్ట్ కెప్టెన్గానే!

Rohit Sharma : టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్.. ఇక వన్డే, టెస్ట్ కెప్టెన్గానే!
X

గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ తర్వాత నుంచి ట20 ఫార్మట్ కు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ.. వన్డే ప్రపంచకప్ పైనే పూర్తి దృష్టిపెట్టాడు. అప్పటి నుంచి ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. విరాట్ కోహ్లీ కూడా టీ20లకు దూరంగా ఉన్నాడు. రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాకు తాత్కాలిక సారద్య బాధ్యతలు అప్పగించి.. పూర్తిగా కుర్రాళ్లతో జట్టును నడిపిస్తున్నారు. హార్దిక్ లేని పక్షంలో ఇతరులను కెప్టెన్ గా నియమించింది. కాగా వచ్చే ఏడాది జూన్ లో టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో కోహ్లీ, రోహిత్ మళ్లీ టీ20 ఫార్మట్ లో పునరాగమనం చేస్తారా అన్నదానిపై చర్చ నడుస్తుంది. అయితే కోహ్లీ సంగతేమో కానీ.. రోహిత్ అయితే మళ్లీ టీ20లు ఆడే అవకాశం లేదని తెలుస్తుంది. ప్రస్తుతం రోహిత్ కు 36 ఏళ్లు. ఏడాది నుంచి టీ20లకు దూరంగా ఉన్నాడు. కాగా కెరీర్ లో ఈ దశలో టీ20ల్లో తిరిగి రావాలని, కుర్రాళ్ల అవకాశాలను అడ్డంకిగా మారాలని అనుకోవట్లేదని బీసీసీఐ వర్గాల సమాచారం.

ఇదేం కొత్త విషయం కాదు. వన్డే వరల్డ్ కప్ పై దృష్టిపెట్టి టీ20లకు దూరమయ్యాడు. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తో చర్చించిన తర్వాతే.. రోహిత్ టీ20లకు దూరంగా ఉన్నాడు. ఇది పూర్తిగా రోహిత్ నిర్ణయమే అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అదే నిజం అయితే రోహిత్ ను టీ20ల్లో ఇక చూడలేం. త్వరలో మీడియా ముఖంగా రిటైర్మెంట్ ప్రకటించినా ఆసక్తిపోనవసరం లేదు. కాగా రోహిత్ అభిమానులు మాత్రం హిట్ మ్యాన్ కొనసాగాలని ఆశిస్తున్నారు. వన్డ్ ప్రపంచకప్ లో ఓపెనర్ గా ఎంతటి విధ్వంసం సృష్టించాడో తెలిసిందే. టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ గా నిలిచాడు కూడా. ఇంకా అతనిలో శక్తి తగ్గలేదని, వన్డేల్లో కనసాగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.




Updated : 23 Nov 2023 3:22 AM GMT
Tags:    
Next Story
Share it
Top