Home > క్రీడలు > కేసీఆర్ అధికార దుర్వినియోగానికి కాళేశ్వరం సాక్ష్యం : కోదండరాం

కేసీఆర్ అధికార దుర్వినియోగానికి కాళేశ్వరం సాక్ష్యం : కోదండరాం

కేసీఆర్ అధికార దుర్వినియోగానికి కాళేశ్వరం సాక్ష్యం : కోదండరాం
X

కాళేశ్వరం వాస్తవాలను ప్రభుత్వం ప్రజల ముందు పెట్టాలని.. లేదంటే తామే బయటపెడతామని టీజేఎస్ చీఫ్ కోదండరాం సహా రిటైర్డ్ ఇంజినీర్లు అన్నారు. కేసీఆర్ అధికార దుర్వినియోగానికి కాళేశ్వరం ప్రాజెక్టు సాక్ష్యమని ఆరోపించారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ‘‘కుంగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్లకు పరిష్కార మార్గాలు ఏమిటీ..?’’ అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో కోదండరాం సహా రిటైర్డ్ ఇంజినీర్లు, మేధావులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

గిన్నీస్ రికార్డు కోసమే కట్టారన్న కోదండరాం.. ప్రాజెక్టు అద్భుతాలపై రాష్ట్ర ప్రభుత్వం తన ప్రగల్భాలు ఆపాలని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు డ్యాం సేఫ్టీ రిపోర్ట్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఎవరు చేసే పని వారు చేయాలని.. కేసీఆరే అన్ని పనులు చేస్తానంటే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన లేకపోవడం దారుణమన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, దేవాదుల ప్రాజెక్టులు ధృడంగా ఉంటే కాళేశ్వరం కట్టి మూడేళ్లు కాకముందే కుంగిపోవడం సిగ్గుచేటన్నారు. అధికార దుర్వినియోగమే దీనికి కారణంగా కనిపిస్తోందని విమర్శించారు.

మేడిగడ్డ చాలా క్రిటికల్ ప్రాజెక్ట్ అని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ నర్సింహారావు అభిప్రాయపడ్డారు. బ్యారేజ్లు 5 టీఎంసీల వరకే నిర్మిస్తారని.. వాటిని డెల్టా ప్రాంతంలోనే కడతారని చెప్పారు. రికార్డ్ కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టులో స్టోరేజ్ చేయని పక్షంలో ఎప్పుడూ ఫ్లష్ చేస్తూ ఉండాలన్నారు. గోదావరి నదిపై స్టడీ చేయకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం సరికాదని రిటైర్డ్ ప్రొఫెసర్ రమేష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రిటైర్డ్ ఇంజినీర్లపై ఆధారపడి కట్టారని.. ఇప్పుడు ప్రాజెక్టు బాధ్యత ఎవరు తీసుకుంటారని నిలదీశారు. కాళేశ్వరం అంతర్జాతీయ టూరిజం కోసమే కట్టారు.


Updated : 3 Nov 2023 2:24 PM GMT
Tags:    
Next Story
Share it
Top