Home > క్రీడలు > భార్య జెర్సీనెంబర్‌తో దిగి చితక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్..

భార్య జెర్సీనెంబర్‌తో దిగి చితక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్..

భార్య జెర్సీనెంబర్‌తో దిగి చితక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్..
X

ఐపీఎల్ 2023లో రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా రాణించాడు. చెన్నై ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ ముగిసిన రోజుల వ్యవధిలోనే రుతారాజ్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి ఉత్కర్ష పవార్‌ మెడలో మూడు ముళ్లు వేశాడు. జూన్‌ 3-4 తేదీల్లో వీరి వివాహం ఘనంగా జరిగింది.

వివాహం అనంతరం మొదటిసారి మైదానంలో దిగాడు గైక్వాడ్. మహారాష్ట్ర ప్రీమియర్‌ లీగ్‌‌లో భాగంగా పుణేరి బప్పా, కొల్హాపూర్‌ టస్కర్స్‌ మధ్య ఆరంభ మ్యాచ్‌ జరిగింది. పుణేరి బప్పా కెప్టెన్‌గా ఉన్న రుతురాజ్ తన ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగించాడు.కేవలం 22 బంతుల్లో అర్థసెంచరీ సాధించాడు. ఓవరాల్‌గా 27 బంతుల్లోనే 5 సిక్సర్లు, ఐదు ఫోర్లతో 67 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో కొల్హాపూర్‌ టస్కర్స్‌ విధించిన 145 పరుగుల టార్గెట్‌ను 29 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.

ఈ మ్యాచ్‌లో రుతురాజ్ బ్యాటింగ్‌తో పాటు మరో విషయం వైరల్‌గా మారింది. పెళ్లి జరిగాక మొదటి మ్యాచ్ లో భార్య జెర్సీ నంబర్‌తో బరిలోకి దిగాడు. ఆమె జెర్సీ నెంబర్‌ 13కాగా రుతురాజ్‌ జెర్సీ నెంబర్‌ 31.. కానీ నిన్నటి మ్యాచ్‌లో ఆమె జెర్సీ నెంబర్‌ అయిన 13తో బరిలోకి దిగి రాణించడం విశేషం.

రుతురాజ్ భార్య ఉత్కర్ష పవార్‌ కూడా ఓ క్రికెటర్. మ‌హారాష్ట్ర త‌ర‌ఫున అనేక దేశ‌వాళీ మ్యాచ్‌లు ఆడింది. పేస్ బౌలింగ్, బ్యాటింగ్‌ చేయగలదు. అయితే ఉత్కర్ష పవార్ గత ఏడాదిన్నర నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంది. ప్రస్తుతం పుణేలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్, ఫిట్‌నెస్ సైన్స్‌లో ఆమె విద్యనభ్యసిస్తోంది.

Updated : 16 Jun 2023 4:26 PM IST
Tags:    
Next Story
Share it
Top