Home > క్రీడలు > IND vs SA: మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం

IND vs SA: మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం

IND vs SA: మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
X

దక్షిణాఫ్రికాపై జరిగిన మూడో వన్డే సిరీస్​లో టీమ్ఇండియాదే పై చేయిగా నిలిచింది. గురువారం జరిగిన ఆఖరి వన్డేలో 78 పరుగుల తేడాతో సఫారీలను చిత్తు చేసి సిరీస్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరు చేయడం.. ఆ తర్వాత భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో 2-1 తేడాతో మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. ఇక 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా సంజు శాంసన్‌ నిలవగా, అర్ష్‌దీప్‌ సింగ్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌' అవార్డు లభించింది.

మొదటగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసిన సౌతాఫ్రికా ముందు 297 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.సంజూ శాంసన్ 108 పరుగులు చేసి తన తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ (52) కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. యంగ్ సెన్సేషన్ రింకూ సింగ్ కూడా 38 పరుగులతో మెరిశాడు. ఓపెనర్​గా మైదానంలోకి దిగిన రజత్​ 22 పరుగులు చేసి ఔటయ్యాడు. కానీ ఆ ఇన్నింగ్స్​లోనే మూడు ఫోర్లు, రెండు సిక్సులతో మెరిశాడు. అయితే టోర్నీ మొదటి రెండు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు సాధించిన సాయి సుదర్శన్ ఈ సారి నిరాశపరిచాడు. కేవలం 10 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం 297 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు భారత బౌలర్ల ధాటికి కుప్పకూలారు.

45.5 ఓవర్లలోనే 218 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది సౌతాఫ్రికా. ముందుగా ఓపెనర్లుగా బరిలోకి దిగిన టోనీ డి జోర్జి , రిజా హెండ్రిక్స్.. ముందు నిలకడగా ఆడారు. అయితే అర్ష్‌దీప్ వేసిన 9 వ ఓవర్‌లో కేఎల్ రాహుల్‌కు చిక్కి రిజా హెండ్రిక్స్ (19) ఔటయ్యాడు. దీంతో సఫారీలు తమ తొలి వికెట్​ను కోల్పోయారు. ఆ తర్వాత 15 ఓవర్లో సౌతాఫ్రికా తన రెండో వికెట్​ను కోల్పోయింది. రెండో వన్డేలో సెంచరీ చేసి భారత్‌కు విజయం దూరం చేసిన జోర్జి(81) మరోసారి రెచ్చిపోగా... అర్షదీప్ ఆ స్పీడ్‌కి బ్రేక్ వేశాడు. ప్రమాదకరంగా మారిన జోర్జిని (81 పరుగులు, 87 బంతుల్లో, 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్షదీప్ సింగ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో జోర్జిదే అత్యధిక స్కోరు. కెప్టెన్ మార్‌క్రమ్ చేసిన 36 పరుగులు ఆ జట్టు తరఫున రెండో అత్యధిక స్కోరు. క్లాసెన్(21),బురాన్ హెండ్రిక్(18),డేవిడ్ మిల్లర్(10) పరుగులు చేశారు. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ కి వీరంతా వరుసగా పెవిలియన్ చేరుకున్నారు.




Updated : 22 Dec 2023 7:13 AM IST
Tags:    
Next Story
Share it
Top