Home > క్రీడలు > నా హృదయాన్ని టచ్ చేశావ్.. కోహ్లీపై సచిన్ ప్రశంసలు..

నా హృదయాన్ని టచ్ చేశావ్.. కోహ్లీపై సచిన్ ప్రశంసలు..

నా హృదయాన్ని టచ్ చేశావ్.. కోహ్లీపై సచిన్ ప్రశంసలు..
X

వన్డే క్రికెట్‌లో సచిన్ రికార్డు బ్రేక్ చేయడంతో విరాట్‌ కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తన రికార్డును బ్రేక్‌ చేయడంపై సచిన్‌ స్పందించారు. కోహ్లీ తనను మొదటిసారి కలిసిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ ప్రశంసలు కురిపించారు.‘‘ఫస్ట్ టైం నిన్ను డ్రెస్సింగ్‌ రూమ్‌లో కలిసినప్పుడు.. నా పాదాలను తాకుతుంటే ఇతర ఆటగాళ్లు నిన్ను ప్రాంక్‌ చేశారు. అప్పుడు నాకూ నవ్వు ఆగలేదు. కానీ నీ అంకితభావం, నైపుణ్యంతో నా హృదయాన్ని టచ్‌ చేశావ్‌.. ఆ యువకుడు ‘విరాట్’ ప్లేయర్‌గా ఎదిగినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని ట్వీట్‌ చేశారు.

విరాట్ కోహ్లీ న్యూజిలాండ్పై సెంచరీ చేసి సచిన్ రికార్డు బద్దలు కొట్టాడు. ఈ అద్భుత ఘట్టానికి వాంఖడే స్డేడియం సాక్ష్యంగా నిలిచింది. 106 బంతుల్లో 100 పరుగులు చేసిన కోహ్లీ.. వన్డేల్లో 50 సెంచరీలు చేసి సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ తన కేరీర్లో 463 వన్డేలు ఆడి 49 సెంచరీలు చేశాడు. కింగ్ కోహ్లీ మాత్రం 291 మ్యాచ్‌లలో ఆ రికార్డును బ్రేక్ చేశాడు. అటు హాఫ్ సెంచరీల్లోనూ విరాట్ రికార్డు నెలకొల్పాడు. వన్డే చరిత్రలోనే అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 120 హాఫ్ సెంచరీలతో రెండో స్థానంలో ఉన్న సంగక్కర రికార్డును 120 హాఫ్ సెంచరీలతో కోహ్లీ బద్దలగొట్టాడు. కాగా 145 హాఫ్ సెంచరీలతో సచిన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు.

Updated : 15 Nov 2023 8:43 PM IST
Tags:    
Next Story
Share it
Top