IND vs SA: అదరగొడుతున్న సాయి సుదర్శన్.. వన్డేల్లో రింకూ సింగ్ ఎంట్రీ
X
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా.. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో టాస్ ఓడిన టీమిండియా బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (4), మూడో వికెట్ లో వచ్చిన తిలక్ వర్మ (10. 30 బంతుల్లో) మరోసారి విఫలం అయ్యారు. కాగా ప్రస్తుతం అరంగేట్ర బ్యాటర్, ఓపెనర్ సాయి సుదర్శన్ (55, 74 బంతుల్లో నాటౌట్), కెప్టెన్ కేఎల్ రాహుల్ తో (29, 35 బంతుల్లో) కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు.
వ్యక్తిగత కారణాలతో శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరం కాగా.. సంజూ శాంసన్ ఎంట్రీ ఇచ్చాడు. టీ20 సంచలనం రింకూ సింగ్ ఈ మ్యాచ్ తో వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ అతనికి టీమిండియా క్యాప్ ఇచ్చి జట్టులోకి ఆహ్వానించాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ప్రోటీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. నాంద్రే బర్గర్ రెండు వికెట్లు పడగొట్టి టీమిండియాను దెబ్బకొట్టాడు.
టీమిండియా ప్లేయింగ్ 11: సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (C), సంజూ శాంసన్, తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్
సౌతాఫ్రికా ప్లేయింగ్ 11: ఐడెన్ మార్క్రమ్ (C), టోనీ, రిజా హెండ్రిక్స్, డస్సెన్, క్లాసెన్, మిల్లర్, మల్దర్, కేశవ్ మహారాజ్, బర్జర్, విలియమ్స్, హెండ్రిక్స్
A fifty on debut for Sai Sudarshan.
— Cricketopia (@CricketopiaCom) December 17, 2023
Indian bench strength is too strong. pic.twitter.com/Finc0SIibA