Home > క్రీడలు > అరంగేట్రంలో హాఫ్ సెంచరీ.. భారత్ను గెలిపించిన సాయి సుదర్శన్

అరంగేట్రంలో హాఫ్ సెంచరీ.. భారత్ను గెలిపించిన సాయి సుదర్శన్

అరంగేట్రంలో హాఫ్ సెంచరీ.. భారత్ను గెలిపించిన సాయి సుదర్శన్
X

సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ ను సమం చేసిన టీమిండియా.. వన్డే సిరీస్ ను ఘనంగా ఆరంభించింది. జొహానెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ప్రొటీస్ కు చుక్కలు చూపిస్తుంది. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా.. భారత బౌలర్ల ముందు మోకరిల్లుతోంది. అర్షదీప్ సింగ్ (5), అవేశ్ ఖాన్ (4) విజృంభించారు. దాటిగా ఆరంభిస్తారనుకున్న సౌతాఫ్రికా ఓపెనర్లను అర్షదీప్ బోల్తా కొట్టించాడు. రీజా హెండ్రిక్స్ డకౌట్ కాగా, టోనీ డి జోర్జి 28 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తర్వాత వాండర్ డసెన్ ను కూడా డకౌట్ చేసిన అర్షదీప్ భారత్ కు 5 కీలక వికెట్లు అందించాడు.

అర్షదీప్ జోరుకు అవేశ్ ఖాన్ తోడవడంతో.. సౌతాఫ్రికా ఏ దశలోనూ కుదురుకోలేకపోయింది. 28 ఓవర్లలో 116 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ మార్క్రమ్ (12), క్లసెన్ (6), డేవిడ్ మిల్లర్ (2), వియాన్ ముల్దర్ (0) పెవిలియన్ కు క్యూ కట్టారు. చివర్లో ఫెహ్లుక్వాయో (33), షంసీ (11) రన్స్ తో రాణించడంతో సౌతాఫ్రికా 100 పరుగుల మార్క్ ను దాటగలిగింది.

117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. అద్భుతంగా ఆడింది. కేవలం 17 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను చేధించింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (5) నిరాశ పరిచినా.. అరంగేట్ర ఓపెనర్ సాయి సుదర్శన్ సత్తా చాటాడు. 43 బంతుల్లో 55 పరుగులతో అద్భుతంగా రాణించాడు. తనకు శ్రేయస్ అయ్యర్ 45 బంతుల్లో 52 పరుగులు తోడవడంతో టీమిండియా సులువుగా విజయం సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఆండిలే ఫెహ్లుక్వాయో, వియాన్ ముల్డర్ చెరో వికెట్ పడగొట్టారు.

Updated : 17 Dec 2023 6:33 PM IST
Tags:    
Next Story
Share it
Top