Home > క్రీడలు > Sania weds Shami: షోయబ్ మాలిక్ మూడో పెళ్లికి కౌంటర్.. క్రికెటర్ షమీతో సానియా మీర్జా రెండో పెళ్లి..?

Sania weds Shami: షోయబ్ మాలిక్ మూడో పెళ్లికి కౌంటర్.. క్రికెటర్ షమీతో సానియా మీర్జా రెండో పెళ్లి..?

Sania weds Shami: షోయబ్ మాలిక్ మూడో పెళ్లికి కౌంటర్.. క్రికెటర్ షమీతో సానియా మీర్జా రెండో పెళ్లి..?
X

పాకిస్థాన్ క్రికెటర్, సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ మూడో పెళ్లి సంచలనం రేపిన విషయం తెలిసిందే. సానియాతో విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో అతడు పాక్ నటి సనా జావేద్‌ ను పెళ్లిచేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా షోయబ్, సానియాల వివాహం 2010లో జరిగింది. వారికి ఒక బాబు కూడా ఉన్నాడు. అంతకు ముందు అయేషా సిద్దిఖీని పెళ్లాడిన షోయబ్.. 2010లో ఆమెతో విడిపోయి సానియాను పెళ్లాడాడు. కాగా సనా జావెద్ కు కూడా ఇది రెండో పెళ్లి. ప్రస్తుతం సానియా, షోయబ్ విడిపోవడానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే వీరు విడిపోవడం మాత్రం ఇద్దరి కుటుంబాలకు ఇష్టం లేనట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

టీమిండియా పేస్ బౌలర్ మహమ్మద్ షమీ, సానియా మీర్జా పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తుల వినిపిస్తున్నాయి. ఇవి చాలదన్నట్లు పెళ్లి కొడుకు గెటప్ లో ఉన్న షమీ ఫొటోలను ట్యాగ్ చేసి, నిశ్చితార్థం కూడా జరిగింది.. ఇక మిగిలింగి గుడ్ న్యూసే అంటూ కామెంట్ పెడుతున్నారు. కాగా షమీకి 2014లో మోడల్ హసీనా జహాన్ తో పెళ్లైంది. అయితే షమీ, అతని కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. హసీనా కోర్టులో కేసువేసింది. ప్రస్తుతం వీరి కేసు కోర్టులో నడుస్తుంది. ఇది చాలదన్నట్లు మరోవార్త కూడా సోషల్ మీడియాలను షేక్ చేస్తుంది. సానియా, సిరాజ్ ఇద్దరూ హైదరాబాద్ కు చెందిన వారు కావడం వల్ల.. ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ వార్త ప్రచారంలో ఉంది. దీనిపై కూడా సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ నడుస్తుంది. ఇంతకీ సానియా పెళ్లి చేసుకోబోయేది సిరాజ్ నా? షమీనా? అంటూ చర్చలు నడుస్తున్నాయి. ఈ వార్తలు ఎంతవరకు కరెక్టో తెలియాల్సి ఉంది.






Updated : 22 Jan 2024 4:50 PM IST
Tags:    
Next Story
Share it
Top