Home > క్రీడలు > Sania Mirza's Family : వాళ్లిద్దరూ కొన్ని నెలల క్రితమే విడిపోయారు.. సైలెన్స్ బ్రేక్ చేసిన సానియా ఫ్యామిలీ

Sania Mirza's Family : వాళ్లిద్దరూ కొన్ని నెలల క్రితమే విడిపోయారు.. సైలెన్స్ బ్రేక్ చేసిన సానియా ఫ్యామిలీ

Sania Mirzas Family : వాళ్లిద్దరూ కొన్ని నెలల క్రితమే విడిపోయారు.. సైలెన్స్ బ్రేక్ చేసిన సానియా ఫ్యామిలీ
X

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో పెళ్లిపై సానియా మీర్జా కుటుంబం తొలిసారి స్పందించింది. దీంతో పాటు సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులను కూడా ఖరారు చేసింది. ఈ మేరకు సానియా మీర్జా సోదరి అనమ్ మీర్జా ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో సానియా మీర్జా, షోయబ్ మాలిక్ చాలా కాలం క్రితం విడాకులు తీసుకున్నారని వెల్లడించారు. , ‘సానియా ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుతుంది. పబ్లిక్‌ లైఫ్‌కు దూరంగానే వ్యవహరించింది. అయితే కొన్ని క్లిష్ట పరిస్థితుల కారణంగా ఇప్పుడు అన్నీ చెప్పుకోవాల్సిన సందర్భం వచ్చింది. షోయబ్, సానియా కొన్ని నెలల క్రితమే విడాకులు తీసుకున్నారని మేము చెప్పాలనుకుంటున్నాము. ఈ విషయంలో ఇక చర్చ అనవసరం. కొత్త జీవితం ప్రారంభించిన షోయబ్‌ కొత్త ప్రయాణం బాగుండాలని సానియా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపింది. అలాగే ఈ కష్ట సమయంలో అందరూ సానియాకు అండగా నిలవాలని కోరుకుంటున్నాం’ అని తన ప్రకటనలో రాసుకొచ్చింది సానియా మీర్జా ఫ్యామిలీ.

షోయబ్ మాలిక్‌, సానియా మీర్జా విడిపోవడానికిగల స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. మాలిక్‌ వివాహేతర సంబంధాలే దీనికి కారణమని పాక్‌ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, వీరిద్దరి విడిపోవడం.. ఇరు కుటుంబాలకు ఇష్టం లేనట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా మాలిక్‌ మూడో పెళ్లి చేసుకోవడం అతడి కుటుంబ సభ్యులకే నచ్చనట్లు సమాచారం. దీంతో ఆ పెళ్లికి వారంతా దూరంగా ఉన్నట్లు తెలిసింది. ‘‘షోయబ్‌ మాలిక్‌ కుటుంబం నుంచి ఎవరూ ఈ పెళ్లికి హాజరుకాలేదు. ఇప్పటికే విడాకులు తీసుకున్న సనా జావెద్‌ను మాలిక్‌ వివాహం చేసుకోవడం వారికి ఇష్టం లేదు. సానియాతో విడాకులు తీసుకోవడం కూడా మాలిక్ సోదరికి నచ్చలేదు. ఇదంతా మాలిక్‌ వివాహేతర సంబంధాల వల్లేనని వారంతా భావిస్తున్నారు’’ అని పాక్‌ మీడియా కథనాలు పేర్కొన్నాయి.




Updated : 21 Jan 2024 2:07 PM IST
Tags:    
Next Story
Share it
Top