Home > క్రీడలు > Sania Mirza : మహిళలపై ఇంకా వివక్షనా.. షాకింగ్ ట్వీట్ చేసిన సానియా మీర్జా

Sania Mirza : మహిళలపై ఇంకా వివక్షనా.. షాకింగ్ ట్వీట్ చేసిన సానియా మీర్జా

Sania Mirza : మహిళలపై ఇంకా వివక్షనా.. షాకింగ్ ట్వీట్ చేసిన సానియా మీర్జా
X

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా షాకింగ్ ట్వీట్ చేశారు. స్త్రీ, పురుష వివక్ష అనేది ఇంకా ఉండటంతో విచారం వ్యక్తం చేసింది. వివక్ష చూపొద్దంటూ నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు..ఉమెన్ సక్సెస్‌పై అర్బన్ క్లాన్ కంపెనీ యాడ్ ను పోస్ట్ చేస్తూ సుదీర్ఘ వ్యాఖ్యానం చేశారు. మహిళలపై ఇంకా చిన్న చూపు కొనసాగడం విచారకరమని పేర్కొన్నారు. ఓ మహిళ సాధించిన విజయానికి ఎలా విలువ కడుతున్నామని ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ సోషల్‌మీడియాలో ఆమె ట్వీట్ చేశారు. చోటీ సోచ్ పేరుతో అర్బన్ క్లాన్ కంపెనీ విడుదల చేసిన యాడ్ లో ఓ మహిళ బ్యూటీషియన్ గా పనిచేస్తూ ఓ కారు కొనుగోలు చేస్తుంది. నూతన కారులో ఇంటికి వచ్చిన ఉమెన్‌ను చూసి చుట్టుపక్కల వాళ్లు హేళనగా మాట్లాడుతారు.





పార్కింగ్ వద్ద క్రికెట్ ఆడుకుంటున్న ఆమె తమ్ముడు ఈ మాటలు విని బాధపడుతూ ఇంటికి వస్తాడు. ఇరుగుపొరుగు అన్న మాటలను అక్కకు చెబుతూ ఆవేదన చెందుతాడు. దీంతో ఆ మహిళ మాట్లాడుతూ.. ‘నేను కొన్న కారు అందరికీ కనబడుతుంది కానీ దానిని కొనేందుకు నేను పడ్డ శ్రమ, నా కష్టం ఎవరికీ కనిపించదు. ఓ మహిళ విజయం సాధించిన ప్రతిసారీ సమాజం ఆమెను కించపరచాలనే చూస్తుంది. అలాంటి మాటలకు బాధపడుతూ ఉన్నచోటనే ఆగిపోవాలా.. కష్టపడుతూ ముందుకు సాగాలా అనేది మన చేతుల్లోనే ఉంటుంది’ అని చెబుతుంది. ఈ వీడియోకు సానియా స్పందిస్తూ ఉద్విగ్నభరిత పోస్ట్‌ చేశారు. ‘‘2005లో డబ్ల్యూటీఏ టైటిల్‌ గెలిచి.. ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళగా నిలిచాను. అది గొప్పదే కదా..?డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌గా ఉన్నప్పుడు.. నేను ఎప్పుడు స్థిరపడతానా అని ప్రజలు ఆసక్తిగా చూశారు. ఆరు గ్రాండ్‌స్లామ్‌లు గెలవడం ఈ సమాజానికి సరిపోలేదు. ఈ కెరీర్‌లో నాకు ఎంతోమంది మద్దతు ఇచ్చారు. కానీ, ఓ ఉమెన్ సక్సెస్ సాధించినప్పుడు నైపుణ్యాలు, శ్రమకు బదులుగా అసమానతలు, ఆమె ఆహార్యం గురించే ఎందుకు చర్చిస్తారనేది ఇప్పటికీ అర్థం కాదు. ఈ యాడ్‌ చూసిన తర్వాత నా మదిలో ఎన్నో భావాలు మెదిలాయి. ఈ సమాజంలో నిజాలు గురించి మాట్లాడటం కష్టమేనని తెలుసు. కానీ, ఓ మహిళ సాధించిన విజయానికి మనం ఎలాంటి విలువ ఇస్తున్నామనే దానిపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. కానీ, అది ఎప్పటికి జరిగేనో..!’’ అని సానియా రాసుకొచ్చారు.




Updated : 2 March 2024 7:51 AM GMT
Tags:    
Next Story
Share it
Top