మూడో టెస్ట్ నుంచి శ్రేయస్ అయ్యర్ను తప్పించిన బీసీసీఐ.. మరో స్పిన్ స్పెషలిస్ట్కు చోటు
X
ప్రస్తుతం టీమిండియాలో గట్టిపోటీ ఉంది. కుర్రాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. అవకాశాలకోసం ఎదురుచూస్తున్నారు. ఈ టైంలో వచ్చిన అవకాశాల్ని వినియోగించుకోవడం ప్రతీఆటగాడికి చాలా ముఖ్యం. ఎంతోకాలంగా రాణిస్తున్న ఆటగాళ్లను కూడా.. ఫెయిల్ అయితే జట్టునుంచి పక్కనబెట్టేస్తున్నారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ప్రతీ ఆటగాడికి కీలకం కానుంది. ఇప్పటికే శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ టైంలో రెండో మ్యాచ్ లో రాణించిన గిల్.. ఒత్తిడిలో అద్భుత సెంచరీచేసి అందరినోళ్లు మూయించాడు. గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన శ్రేయస్ అయ్యర్.. ఆసియా కప్ లో రాణించాడు. అయితే టెస్టుల్లో మాత్ర ఆ జోరు చూపలేకపోతున్నాడు. స్పిన్ ను దాటిగా ఎదుర్కొనే అయ్యర్.. స్వదేశంలో తేలిపోవడం జట్టుకు ఇబ్బంది కలిగించే విషయమే.
అయ్యర్ చివరి ఎనిమిది టెస్ట్ ఇన్నింగ్స్ లో చూసుకుంటే.. 31, 6, 0, 4 నాటౌట్, 35, 12, 27, 29 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో రాబోయే చివరి మూడు టెస్టులకు అతనిపై వేటు పడే అవకాశం ఉంది. సౌతాఫ్రికా టెస్టుల్లోనూ ఇదే తరహాలో ఫెయిల్ అయ్యాడు. దీంతో అయ్యర్ ను తప్పించాలనే డిమాండ్ పెరిగిపోయింది. అతని స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ ను జట్టులోకి తీసుకోవాలని క్రికెట్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. సర్ఫరాజ్ కూడా స్పిన్ లో బాగా ఆడగలడు. చాలాకాలంగా దేశవాళీలో రాణిస్తున్న సర్ఫరాజ్ ను.. జాతీయ జట్టులోకి ఎంపిక చేయడం ఇదే సరైన సమయం. ఇప్పటికే కోహ్లీ స్థానంలో రజత్ పటిదార్ అరంగేట్రం చేసి.. పరవాలేదనిపించాడు. కాగా కీలకమైన మూడో టెస్ట్ లో సర్ఫరాజ్ ఖాన్ కు అవకాశం దక్కుతుందో లేదో చూడాలి.