Sarfaraz Khan : ఆ క్రికెటర్ చెప్పడం వల్లే మ్యాచ్కు వచ్చా..సర్ఫరాజ్‌తండ్రి
X
ముంబై బ్యాటర్ సర్ఫరాజ్‌ఖాన్ రాజ్ కోట్ టెస్ట్తో ఇండియా జట్టులోకి అడుగు పెట్టాడు. తన అరంగ్రేట టెస్టు మ్యాచ్‌లోనే బ్యాటింగ్ తో అందరిని ఆకట్టుకున్నాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో అతడు హాఫ్ సెంచరీ చేశాడు. గత కొంతకాలంగా దేశవాలీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న సర్ఫరాజ్‌కు..చాలాకాలం తరువాత టీమ్ఇండియాలో చోటు దక్కింది. రాక రాక వచ్చిన అవకాశాన్ని అతడు చక్కగా వినియోగించుకున్నాడు.
టీమిండియా క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే అతడికి టెస్ట్ క్యాప్ ను అందించి జట్టులోకి సాదరంగా ఆహ్వానించాడు. కొడుకుకి క్యాప్ అందిస్తున్న టైంలో సంతోషంతో సర్ఫరాజ్ తండ్రి నౌషద్‌ఖాన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తర్వాత కొడుకును కౌగిలించుకుని క్యాప్‌కు ముద్దుపెట్టారు. సర్ఫరాజ్ కూడా కొంత భావోద్వేగానికి గురయ్యాడు. తన తొలి మ్యాచ్ లోనే అదరగొట్టిన సర్ఫరాజ్ 62 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు.
అయితే, సర్ఫరాజ్ తండ్రి నిజానికి కుమారుడి మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి రావాలని అనుకోలేదట. టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చెప్పడం వల్లే వచ్చినట్లు నౌషద్ తెలిపారు.
నిజానికి తాను మ్యాచ్ చూసేందుకు రావాలని అనుకోలేదని..తనొస్తే అది సర్ఫరాజ్‌పై ఒత్తిడికి కారణమవుతుందని భావించినట్లు చెప్పారు. దీనికి తోడు కొంత ఆరోగ్యం బాలేదు కాబట్టి రాజ్‌కోట్ వెళ్లాలని అనుకోలేదని చెప్పుకొచ్చారు. కాని సూర్య చేసిన మెసేజ్‌కు కరిగిపోయి వెంటనే రాజ్‌కోట్ కు వచ్చినట్లు నౌషద్ చెప్పారు.
నేను మీ భావోద్వేగాన్ని అర్థం చేసుకోగలనని సూర్య మేసేజ్ లో చెప్పాడంట. గతేడాది మార్చిలో నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌లో తాను అరంగేట్రం చేసినట్లు చెప్పాడు. టెస్టు క్యాప్ అందుకుంటున్నప్పుడు తన తల్లిదండ్రులు తన వెనకే ఉన్నారని గుర్తు చేశాడని తెలిపాడు. ఆ క్షణాలు ప్రత్యేకమైనవని, ఇలాంటివి మళ్లీమళ్లీ రావని, కాబట్టి మీరు వెళ్లాలనే తాను కోరుకుంటున్నట్టు సూర్య మెసేజ్ చేయడంతో వెంటనే వచ్చినట్లు నౌషద్ చెప్పాడు.
𝗦𝘂𝗿𝗽𝗿𝗶𝘀𝗲 𝗦𝘂𝗿𝗽𝗿𝗶𝘀𝗲!
— BCCI (@BCCI) February 15, 2024
A special phone call 📱 after a memorable Test Debut!#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/QcAFa5If9o