Home > క్రీడలు > రాజకీయ పార్టీల నుంచి ఆఫర్.. రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్

రాజకీయ పార్టీల నుంచి ఆఫర్.. రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్

రాజకీయ పార్టీల నుంచి ఆఫర్.. రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్
X

టీమిండియా సీనియర్ ఆటగాడు సౌరభ్ తివారి క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. 34 ఏళ్ల తివారి ప్రస్తుత రంజీ సీజన్ లో తన జట్టు ప్రస్తావం ముగిసిన తర్వాత.. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. దాదాపు 17 ఏళ్ల పాటు జార్ఖండ్ జట్టకు ప్రాతినిథ్యం వహించిన తివారి.. టీమిండియా, ఐపీఎల్ లో పలు మ్యాచులు ఆడాడు. భారత్ తరుపున 3 వన్డేలు ఆడిన తివారి, ఐపీఎల్ లో 4 ఫ్రాంజీలు మారాడు. 2010 ఐపీఎల్ లో ముంబై తరుపున మెరుపులు మెరిపించిన తివారి 419 పరుగులు చేశాడు. ఆ సీజన్ తో టీమిండియాకు ఆడే అవకాశం దక్కింది. భారత్ తరుపున ఆడిన 3 మ్యాచుల్లో 49 పరుగులు చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్ లో పెద్దగా రాణించలేకపోయినా.. ఫస్ట్ క్లాస్ లో బాగానే ఆడాడు. జార్ఖండ్ తరుపున 115 మ్యాచులు ఆడిన తివారి.. 22 సెంచరీలు చేశాడు. మొత్తం 8030 పరుగులు సాధించాడు. కాగా కోహ్లీ సారథ్యంలో అండర్ 19 వరల్డ్ కప్ నెగ్గిన జట్టులో తివారి ఒకడు. కోహ్లీ చొరవతోనే తివారి ఆర్సీబీ జట్టుకు ఆడాడు. ఈ సందర్భంగా మాట్లాడిన తివారి ‘చదువుకునే రోజుల్లో మొదలుపెట్టిన ఈ ప్రయాణానికి వీడ్కోలు పలకడం కష్టంగా అనిపిస్తుంది. జట్టులో కుర్రాళ్లకు అవకాశాలు కలిపించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నా. నాకు రాజకీయ పార్టీల నుంచి ఆఫర్ వచ్చింది. వాటి గురించి ఇప్పుడేం ఆలోచించను’అని చెప్పుకొచ్చాడు.

Updated : 12 Feb 2024 10:00 PM IST
Tags:    
Next Story
Share it
Top