Home > క్రీడలు > టీమిండియా దక్షిణాఫ్రికా టూర్.. షెడ్యూల్ విడుదల

టీమిండియా దక్షిణాఫ్రికా టూర్.. షెడ్యూల్ విడుదల

టీమిండియా దక్షిణాఫ్రికా టూర్.. షెడ్యూల్ విడుదల
X

సౌతాఫ్రికాలో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం పర్యటించనునన్న టీమిండియా షెడ్యూల్ ను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. ఈ పర్యటన మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌తో పాటు రెండు టెస్టులతో కూడిన గాంధీ-మండేలా ట్రోఫీ ఫ్రీడమ్ సిరీస్‌తో ముగుస్తుంది.

డిసెంబర్ 10న డర్బన్‌ వేదికగా మొదటి టీ 20 డిసెంబర్ 12న రెండవ టీ20, డిసెంబర్ 14న మూడవ టీ20 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. మూడు వన్డేల సిరీస్ డిసెంబర్ 17 నుంచి జోహన్నెస్‌బర్గ్‌లో ప్రారంభం కాగా, రెండో, మూడోవి వరుసగా డిసెంబర్ 19, 21 తేదీల్లో జరుగుతాయి. వన్డే సిరీస్ తర్వాత, డిసెంబర్ 26 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. రెండో టెస్టు జనవరి 3, 2024 నుంచి కేప్‌టౌన్‌లో జరగనుంది. వచ్చే ఏడాది కరేబియన్‌లో జరగనున్న టీ 20 ప్రపంచకప్‌కు ముందు ఈ సిరీస్ భారత్‌కు ఎంతో కీలకం. గాంధీ-మండేలా టెస్ట్ సిరీస్ కూడా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఉంటుంది.

* భారత్‌ - దక్షిణాఫ్రికా పర్యటన షెడ్యూల్

మొదటి టీ20: ఆదివారం, 10 డిసెంబర్ - డర్బన్

రెండవ టీ 20: మంగళవారం, 12 డిసెంబర్ - గ్కెబెర్హా

మూడవ టీ20 : గురువారం, 14 డిసెంబర్ - జోహన్నెస్‌బర్గ్

మొదటి వన్డే: ఆదివారం, 17 డిసెంబర్ - బెట్‌వే పింక్ డే - జోహన్నెస్‌బర్గ్

రెండవ వన్డే: మంగళవారం, 19 డిసెంబర్ - గ్కెబెర్హా

మూడో వన్డే : గురువారం, 21 డిసెంబర్ - బోలాండ్ పార్క్, పార్ల్

మొదటి టెస్ట్: 26 డిసెంబర్ - 30 డిసెంబర్ - సెంచూరియన్

రెండవ టెస్ట్: 03 జనవరి - 07 జనవరి - కేప్ టౌన్


Updated : 14 July 2023 3:05 PM GMT
Tags:    
Next Story
Share it
Top