Nirmala Sheoran : రెండోసారి డోపీగా తేలిన భారత అథ్లెట్
X
భారత అథ్లెట్ నిర్మల డోపింగ్ టెస్టులో విఫలయ్యారు. ఆమెపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ ఎనిమిదేళ్లు నిషేధం విధించింది. నిర్మల డోపీగా తేలడం ఇది రెండోసారి. 2017 ఆసియా ఛాంపియన్‌షిప్ 400 మీ. పరుగులో ఆమె గోల్డ్ మెడల్ సాధించింది. 2018 లో డోపీగా తేలడంతో నాలుగేళ్ల నిషేదం ఎదుర్కొన్నారు. గతేడాది పురాగమనం చేసి నిర్మల మళ్లీ డోపింగ్‌కు పాల్పడంతో ఇప్పుడు ఎనిమిదేళ్ల నిషేధానికి గురయ్యారు. 2017 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో నిర్మల 400 మీటర్ల పరుగులో పసిడి గెలిచింది. 2018లో డోపీగా తేలడంతో.. ఆమె ఆ పతకం కోల్పోవాల్సి వచ్చింది. నాలుగేళ్ల నిషేధాన్ని అనుభవించిన షెరాన్.. గతేడాది జూన్‌లో అంతరాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌తో పునరాగమనం చేసింది. రెండోసారి ఆమె డోపీగా తేలడంతో ఎనిమిదేళ్ల నిషేధం పడింది. 2023 ఫెడరేషన్ కప్‌లో పసిడి గెలిచిన కిర్‌పాల్ సింగ్ (డిస్కస్‌త్రో), కాంస్యం సాధించిన కరణ్‌వీర్ సింగ్ (షాట్‌పుట్)లతో పాటు మరో 20 మందిపై నాడా క్రమశిక్షణ సంఘం నిషేధం విధించింది.