World Cup : ఫైనల్ మ్యాచ్ చూసేందుకు తరలివచ్చిన ప్రముఖులు..
X
అహ్మదాబాద్ వేదిక భారత్ - ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు ప్రముఖులు తరలివచ్చారు. మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ ను చూసేందుకు సచిన్, షారుఖ్ ఖాన్, వెంకటేష్, సద్గురు, ఆశా బోస్లే,రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొణే,అనుష్క శర్మ, అథియా శెట్టి సహా పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.
కాగా ఈ మ్యాచ్లో టీమిండియా తడబడుతోంది. 211 రన్స్కే 7వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ 12, బూమ్రా0 రన్స్ తో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా కట్టుదిట్టమైన బౌలింగ్ చేస్తోంది. కాగా ఆదిలోనే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్క్ వేసిన నాలుగో ఓవర్లో 30 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ (4) ఔటయ్యాడు. ఆ తర్వాత 9.4వ ఓవర్లో రోహిత్ శర్మ (47) ఔటయ్యాడు. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ చేతికి చిక్కాడు. ఆ వెంటనే కమిన్స్ బౌలింగ్‌లో కీపర్ చేతికి క్యాచ్ ఇచ్చి శ్రేయస్ (4) పెవిలియన్‌కు చేరాడు. దీంతో 81 పరుగులకే టిమిండియా మూడో వికెట్లు నష్టపోయింది. ఆ తర్వాత 54 రన్స్ చేసిన కోహ్లీ బౌల్డ్ అవ్వగా.. ఆ తర్వాత వరుసగా వికెట్ పడ్డాయి.
#WATCH | Mumbai: Actors Ranveer Singh and Deepika Padukone leave for Ahmedabad to watch the ICC World Cup final match between India and Australia. pic.twitter.com/0HMRPsxr8V
— ANI (@ANI) November 19, 2023