IND vs NZ : కీలక వికెట్లతో కివీస్ను దెబ్బకొట్టిన షమీ..
X
న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో షమీ అదరగొట్టాడు. టీమిండియాకు అవసరమైన కీలక వికెట్స్ను పడగొట్టి సత్తా చాటాడు. ప్రస్తుతం కివీస్ నాలుగు వికెట్లను కోల్పోగా.. ఆ వికెట్లన్నీ షమీనే తీశాడు. ఓపెనర్స్ ఇద్దరు ఔట్ అయిన తర్వాత కేన్ విలియమ్సన్, మిచెల్ నిలకడగా ఆడారు. మూడో వికెట్కు 181 రన్స్ జోడించారు. ఇండియాకు ప్రమాదంగా మారిన ఈ జోడిని షమీ నేలకూల్చాడు. వరుసగా విలియమ్సన్, లాథమ్ వికెట్లను పడగొట్టి భారత్కు కొత్త ఊపును తీసుకొచ్చాడు.
కాగా అంతుకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా దంచికొట్టింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న కీలక పోరులో 397 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో చెలరేగి.. కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. గిల్ 80, రోహిత్ 47 రన్స్తో రాణించారు. ఓపెనర్ రోహిత్ శర్మ ముందు నుంచే దూకుడుగా ఆడాడు. 29 బాల్స్లో 47 రన్స్ చేసి సౌథీ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత గిల్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. అయితే గిల్ రిటైర్డ్ హర్ట్ అవడంతో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్తో కలిసి కోహ్లీ కివీస్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. కోహ్లీ 113 బంతుల్లో 117, అయ్యర్ 70 బంతుల్లో 105 రన్స్ చేశారు. అయ్యర్ ఏకంగా 8 సిక్సులతో రఫ్పాడించాడు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ 3వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్ ఒక వికెట్ తీశాడు.