Home > క్రీడలు > MD Shami : క్రికెట్లో షమీ తమ్ముడి ఎంట్రీ.. ఏ జట్టు తరుపున ఆడుతున్నాడంటే?

MD Shami : క్రికెట్లో షమీ తమ్ముడి ఎంట్రీ.. ఏ జట్టు తరుపున ఆడుతున్నాడంటే?

MD Shami : క్రికెట్లో షమీ తమ్ముడి ఎంట్రీ.. ఏ జట్టు తరుపున ఆడుతున్నాడంటే?
X

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ భావోద్వేగానికి లోనయ్యాడు. తన తమ్ముడు మహ్మద్ కైఫ్ బెంగాల్ జట్టు తరుపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరంగేట్రం చేస్తున్నందుకు ఎమోషనల్ అయ్యాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. రంజీ ట్రోఫీ 2024 సీజన్ లో భాగంగా.. శుక్రవారం ఆంధ్రా జట్టుతో మొదలైన మ్యాచ్ లో.. మహ్మద్ కైఫ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో తన తమ్ముడికి అభినందనలు తెలుపుతూ.. షమీ భావోద్వేగానికి గురయ్యాడు.

‘ఎట్టకేలకు సుదీర్ఘ పోరాటం తర్వాత, నువ్వు బెంగాల్ జట్టు తరఫున రంజీ ట్రోఫీ క్యాప్ అందుకున్నావు. చీర్స్. నా దృష్టిలో నువ్వు సాధించిన గొప్ప విజయం. అభినందనలు. రాబోయే కాలంలో అంతా మంచే జరగాలని, గొప్ప భవిష్యత్తు ఉండాలని, మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా. క్రికెట్ లో 100 శాతం బెస్ట్ ఇవ్వు. కష్టపడి పనిచేయి’ అని షమీ రాసుకొచ్చాడు.

లిస్ట్ ఏ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్న కైఫ్ కు.. ఈ ఏడాది రంజీ సీజన్ లో బెంగాల్ జట్టు చోటు కల్పించింది. 2021లో బెంగాల్ తరుపున లిస్ట్ ఏలో అడుగుపెట్టాడు కైఫ్. పోయిన ఏడాది జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో కూడా అదరగొట్టాడు. ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన కైఫ్‌ 12 వికెట్లు పడగొట్టాడు.






Updated : 6 Jan 2024 9:06 AM IST
Tags:    
Next Story
Share it
Top