Home > క్రీడలు > Sharmila : అది మీ చేతకాని కమిట్‌మెంట్‌..వైసీపీ పై షర్మిల ఫైర్

Sharmila : అది మీ చేతకాని కమిట్‌మెంట్‌..వైసీపీ పై షర్మిల ఫైర్

Sharmila : అది మీ చేతకాని కమిట్‌మెంట్‌..వైసీపీ పై షర్మిల ఫైర్
X

వైసీపీపై మరోసారి విరుచుకుపడ్డారు వైఎస్ షర్మిల. పరిపాలనా రాజధానిలో ఇన్నాళ్లూ పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చిందని మండిపడ్డారు. ఎన్నికల ముందు పదేళ్ల వ్యూహాల పేరుతో ఇవి కొత్త నాటకాలు కాదా అని ప్రశ్నించారు. ఈ మేరకు ‘విశాఖ విజన్‌’ పేరుతో సీఎం జగన్‌ చేసిన ప్రకటనపై ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల స్పందిస్తూ ట్వీట్ చేశారు.

విశాఖనే పరిపాలన రాజధాని అని చెప్పి ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం వైసీపీ చేతకాని కమిట్‌మెంట్‌ అని మండిపడ్డారు. ఐటీ హిల్స్‌ నుంచి దిగ్గజ కంపెనీలు తరలి వెళ్లిపోతున్నా.. చూస్తూ ఉండటం మీ రోడ్‌ మ్యాప్‌ అని ఎద్దేవా చేశారు. ఆంధ్రుల తలమానికం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం మీ విజన్‌ అని దుయ్యబట్టారు. రైల్వే జోన్‌ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం మీకు ప్రాక్టికల్‌ అన్నారు. గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మడం, భూములను మింగడం.. ఇదే విశాఖపై వైసీపీ విజన్‌ అని షర్మిల మండిపడ్డారు.


Updated : 6 March 2024 10:17 AM GMT
Tags:    
Next Story
Share it
Top